భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందేశం బ్రీఫ్ నోట్

భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరైన స్వాతంత్య్ర సమరయోధులకు, ప్రజాప్రతినిధులకు, అధికారులు, అనధికారులు, స్వచ్చంద సంస్థలకు, పోలీసు యంత్రాంగానికి, విద్యార్థిని విద్యార్థులకు, కవులు కళాకారులకు, పాత్రికేయ మిత్రులకు మరియు జిల్లా ప్రజలందరికి నా హృదయ పూర్వక 75 వ స్వతంత్ర భారత వజ్రోత్సవ శుభాకాంక్షలు.  స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జాతీ యావత్తు అన్ని ప్రాంతాలలో మువ్వన్నెల జెండాను ఎగురవేసి వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు.   మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా గత సంవత్సరం నుండి జిల్లాలో ఆజాధీకా అమృత్ మహోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించుకున్నాం.  అలాగే ఈ అగస్టు 8 నుండి 22వ తేది వరకు ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఈ వజ్రోత్సవాల వేడుకలలో  ప్రజలలో దేశ సమగ్రతను ప్రతిబింబించేలా జిల్లాలోని 3 లక్షల ఇంటికి  జాతీయ పతాకాలను పంపిణి చేసి  తమ తమ ఇండ్లపై ఎగురవేసి దేశభక్తిని చాటేలా చేశాం. అలాగే మహాత్ముడి జీవితాన్ని, ఆదర్శాలను నేటి తరానికి తెలియజేయాలనే ఉద్దేశ్యంతో జిల్లాలోని అన్ని సినిమా థియోటర్లలలో విద్యార్థులకు గాంధీ చిత్రాన్ని ఉచితంగా చూపిస్తున్నాం. వజ్రోత్సవాల కార్యక్రమాలలో ఫ్రీడం రన్, ఫ్రీడం ర్యాలీ, సాంస్కృతిక కార్యక్రమాలు, కవి సమ్మెళనాలు, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు నిర్వహించాం. అలాగే  సామూహిక జాతీయ గీతాలాపన, క్రీడాపోటీలు, రంగోలీ,  రక్తదాన శిభిరాల ఏర్పాటు, అనాథశ్రమాలు, వృద్దాశ్రమాలలో పండ్లు మరియు స్వీట్ల పంపిణి కార్యక్రమాలను నిర్వహిస్తాం.  జిల్లా ప్రజలందరు స్వతంత్ర్ర భారత వజ్రోత్సవ కార్యక్రమాలలో చురుకుగా పాల్గోని విజయవంతం చేయాలని కోరుచున్నాను.    భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరైన స్వాతంత్య్ర సమరయోధులకు, ప్రజాప్రతినిధులకు, అధికారులు, అనధికారులు, స్వచ్చంద సంస్థలకు, పోలీసు యంత్రాంగానికి, విద్యార్థిని విద్యార్థులకు, కవులు కళాకారులకు, పాత్రికేయ మిత్రులకు మరియు జిల్లా ప్రజలందరికి నా హృదయ పూర్వక 75 వ స్వతంత్ర భారత వజ్రోత్సవ శుభాకాంక్షలు.  స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జాతీ యావత్తు అన్ని ప్రాంతాలలో మువ్వన్నెల జెండాను ఎగురవేసి వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు.   మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా గత సంవత్సరం నుండి జిల్లాలో ఆజాధీకా అమృత్ మహోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించుకున్నాం.  అలాగే ఈ అగస్టు 8 నుండి 22వ తేది వరకు ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఈ వజ్రోత్సవాల వేడుకలలో  ప్రజలలో దేశ సమగ్రతను ప్రతిబింబించేలా జిల్లాలోని 3 లక్షల ఇంటికి  జాతీయ పతాకాలను పంపిణి చేసి  తమ తమ ఇండ్లపై ఎగురవేసి దేశభక్తిని చాటేలా చేశాం. అలాగే మహాత్ముడి జీవితాన్ని, ఆదర్శాలను నేటి తరానికి తెలియజేయాలనే ఉద్దేశ్యంతో జిల్లాలోని అన్ని సినిమా థియోటర్లలలో విద్యార్థులకు గాంధీ చిత్రాన్ని ఉచితంగా చూపిస్తున్నాం. వజ్రోత్సవాల కార్యక్రమాలలో ఫ్రీడం రన్, ఫ్రీడం ర్యాలీ, సాంస్కృతిక కార్యక్రమాలు, కవి సమ్మెళనాలు, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు నిర్వహించాం. అలాగే  సామూహిక జాతీయ గీతాలాపన, క్రీడాపోటీలు, రంగోలీ,  రక్తదాన శిభిరాల ఏర్పాటు, అనాథశ్రమాలు, వృద్దాశ్రమాలలో పండ్లు మరియు స్వీట్ల పంపిణి కార్యక్రమాలను నిర్వహిస్తాం.  జిల్లా ప్రజలందరు స్వతంత్ర్ర భారత వజ్రోత్సవ కార్యక్రమాలలో చురుకుగా పాల్గోని విజయవంతం చేయాలని కోరుచున్నాను.    భారత స్వాతంత్ర్య సంగ్రామం చరిత్రలో ఎంతో విశిష్టమైనది, జాతిపిత మహత్మగాంధీ, లాలలజపతి రాయ్, బిపిన్ చంద్రపాల్, బాలాగంగాధర్ తిలక్, భగత్ సింగ్, పండిట్ జవహార్ లాల్ నెహ్రు, సర్దార్ వల్లబాయ్ పటేల్, లాల్ బహద్దుర్ శాస్త్రీ, గోపాలకృష్ణ గోఖలే, మౌలాన అబుల్ కలాం ఆజాద్ వంటి ఎందరో త్యాగధనుల పోరాట ఫలితంగా మన దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. ఆ మహానీయులు, ఆదర్శమూర్తులకు ఈ సందర్భంగా ఘనంగా నివాలులర్పిస్తున్నాను.  వారు చూపిన మార్గంలో పయనిస్తూ వారి ఆశయాలు, ఆదర్శాల సాధన కోసం మనం అందరం కలిసి కృషి చేయాలని కోరుచున్నాను.    మనం అందరం కోరుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం.  తెలంగాణ ప్రభుత్వం దేశానికే తలమానికంగా ఉండే విధంగా ఎన్నో వినుత్నమైన సంక్షేమ అభివృద్ది పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తుంది.  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ముందుచూపుతో  ఎన్నో సాగునీటి ప్రాజెక్టులను నిర్మించి రైతుల ప్రతిఎకరాకు  సాగునీరు అందిస్తున్నారు.  దేశంలో ఏ  రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నాం.  రైతుల సంక్షేమానికి రైతుబందు, రైతు భీమా వంటి వినూత్న పథకాలను ప్రవేశపెట్టి రైతులను ఆర్థికంగా బలోపేతం చేస్తున్నాం.  వ్యవసాయ శాఖ గత ఆర్థిక వ్యవస్థ వ్యవసాయ రంగం ద్వారానే పటిష్ట పడుతుందని విశ్వసించి సీ.ఎం. కే.సీ.ఆర్ గారు దేశంలోనే మొదటి సారిగా పంట పెట్టుబడి సహాయం అందిస్తూ రైతు బంధు పథకాన్ని  ప్రారంభించారు. రైతు బంధు పథకం కింద సంవత్సరానికి 2 పంటలకు ఎకరానికి రూ.10  వేల పెట్టుబడి సహాయం ప్రభుత్వం అందిస్తుంది. ఈ పథకం కింద 9 విడతలలో  జగిత్యాల జిల్లాలోని 2 లక్షల 15 వేల 673 మంది రైతులకు రూ.1667 కోట్ల సహాయాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసాం. రైతు భీమ పథకం కింద జిల్లాలో  1,34,098 మంది రైతులను నమోదు చేసి, ఇప్పటి వరకు మరణించిన 2777 రైతు కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున రూ. 138.85  కోట్ల చెక్కులను పంపిణి చేశాం. రాష్ట్రంలో 35 లక్షల మంది రైతులకు మొదటి దఫాలో రూ. 17 వేల కోట్ల రుణాలను పూర్తీ రుణ మాఫీ చేసాము. 2018 సంవత్సరంలో పంట రుణాలు రూ. 1 లక్ష రైతు రుణ మాఫీ ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగా జగిత్యాల జిల్లాలో 25  వేలలోపు రుణం తీసుకున్న 9535 మంది రైతులకు రూ.69 కోట్లు, 50 వేలలోపు రుణం తీసుకున్న 7465 మందికి రూ.24.85 కోట్ల మాఫీ జరిగింది. వ్యవసాయంలో అవలంభిస్తున్న మంచి పద్దతులను రైతులు చర్చించుకునేందుకు, సాగు పద్దతిలో వస్తున్నా మార్పులపై రైతులకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ప్రతీ 5 వేల ఎకరాను క్లస్టర్ గా ఏర్పాటు చేసి, ప్రతీ వ్యవసాయ క్లస్టర్ కు వ్యవసాయ విస్తరణ అధికారిని నియమించింది.. జిల్లాలో 71 వ్యవసాయ క్లస్టర్లకు గాను 71 రైతు వేదికలు నిర్మించి వ్యవసాయ నైపుణ్యాలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం.
విద్య శాఖ:
ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను  అభివృద్ధి చేసే దిశగా సీ.ఎం.కేసిఆర్ గారు  రూ. 7500  కోట్లకు పైగా ఖర్చు చేస్తూ మన ఊరు మన బడి పథకాన్ని రూపొందించారు. ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ తరగతి గదులు,  విద్యుద్దీకరణ, పెయింటింగ్,అదనపు తరగతి గదుల  నిర్మాణం, ఫర్నిచర్, గ్రీన్ చాక్ బోర్డు, ప్రహరి గోడ, మరుగు దొడ్లు, కిచెన్ షెడ్లు, డైనింగ్ హాల్ లతో పాటు విద్యార్థులను సురక్షిత త్రాగునీరు వంటి సదుపాయాలను కల్పిస్తున్నాము, జిల్లాలో అత్యధికంగా విద్యార్థులు ఉన్న 274 పాఠశాలలను  మొదటి విడత కింద ఎంపిక చేయగా 61 పాఠశాలలో 133 కొత్త తరగతి గదులు, 32 పాఠశాలలో ప్రహరి గోడలు నిర్మాణం దశలో ఉన్నవి. 267 పాఠశాలలో విద్యుద్దీకరణ పనులు ప్రగతిలో ఉన్నాయి. పేద విద్యార్థులకు సైతం ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన అందించాలనే ఉద్దేశ్యంతో వచ్చే విద్య సంవత్సరం 1 నుండి  8 వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన ప్రారంభిస్తున్నాం. దీనికోసం జిల్లాలోని 1725 మంది ఉపాధ్యాయులకు ఆంగ్ల మాధ్యమంలో శిక్షణ ఇవ్వడం జరిగింది. 10 వ తరగతి పరీక్షలో విద్యార్థులు మంచి ఫలితం సాధించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేక తరగతులను నిర్వహించాం. జూన్ , 2022 లో చేపట్టిన బడి బాట కార్యక్రమంలో 2807 మంది విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం జరిగింది.
వైద్య ఆరోగ్య శాఖ  కోవిడ్ 19  వైరస్ నియంత్రణకు అవసరమైన చర్యలను పకడ్బందిగా చేపట్టాము. జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన వారికి 2 డోసుల కరోనా వ్యాక్సినేషన్ 100 శాతం పూర్తి చేశాం. 15-17 సంవత్సరాల వయసు గల వారికీ మొదటి డోసు 97 శాతం, రెండవ డోసు 58 శాతం, 12-14 వయసు గల వారికీ మొదటి డోసు 92 శాతం, రెండవ డోసు  56 శాతం అందించాం. జిల్లాలో 12 సంవత్సరాలు పై బడిన ప్రతీ ఒక్కరు సమీపంలో గల ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో 2 డోసుల వ్యాక్సినేషన్ తీసుకోవాలని కోరుతున్నాను 18 సంవత్సరాలు పై బడిన 80,022  మందికి ప్రికాషన్ డోసులు ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలోని ప్రతీ జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల, అనుబంధ ఆసుపత్రి నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జగిత్యాల జిల్లాకు వైద్య కళాశాల, అనుబంధ ఆసుపత్రి, నర్సింగ్ కళాశాలలను సీ.ఎం. కేసిఆర్ గారు మొదటి విడతలోనే మంజూరు చేసినందుకు కృతఙ్ఞతలు తెలుపుతున్నాను. ఈ విద్య సంవత్సరం నుండి మెడికల్ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం అవుతున్నవని తెలుపుటకు సంతోషిస్తున్నాను.మాతా శిశు మరణాల నిష్పత్తిని గణనీయంగా తగ్గించడానికి ఇప్పటి వరకు 33 వేల 587 మంది మహిళలకు కేసిఆర్ కిట్లను, రూ.33 కోట్ల  52 లక్షల  07 వేల ఆర్థిక సహాయం పంపిణి చేశాం. జిల్లాలో ఎన్.సీ.డి. సర్వే కింద 4,98,262 మందికి పరీక్షలు నిర్వహించి, 45,664 మందికి బీపి, 18,177 మందికి షుగర్, 384 మందికి సాధారణ క్యాన్సర్ గుర్తించి ప్రతీ నెల  వారి ఇంటి వద్దకే మందులు అందిస్తున్నాం.  తెలంగాణ డయాగ్నోస్టిక్ కేంద్రం ద్వారా 42,496 మందికి  75,334 మంది నుండి నమూనాలను సేకరించి 57 రకాల వైద్య పరీక్షలు నిర్వహించాము. 1,39,094 పరీక్షలను పూర్తీ ఉచితంగా  డయాగ్నోస్టిక్ కేంద్రం ద్వారా నిర్వహించడం జరుగుతుంది.  ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య పెంచే దిశగా అవసరమైన చర్యలను చేపట్టాము, ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ఇప్పటి వరకు 2,490 ప్రసవాలు  ప్రభుత్వ ఆసుపత్రులలో జరిగాయి. జగిత్యాల జిల్లాలో రూ. 18  కోట్ల వ్యయంతో నిర్మించిన 100 పడకల మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ఇటివలే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చె ప్రారంభించుకున్నాం. సాధారణ ప్రసవాల సంఖ్య పెంచే దిశగా గర్భిణి స్త్రీలను మొదటి నుండి మానసికంగా సిద్దం చేయడానికి, సిజేరియన్ ఆపరేషన్ల వల్ల కలిగే నష్టాలను తెలియజేసి క్రమముగా సాధారణ ప్రసవలస్ను పెంచడం జరిగింది.సాగునీటి రంగం  నా తెలంగాణ కోటి రత్నాల వీణ అనే దాశరధి మాటలు వాస్తావా రూపం దాల్చాలని రాష్ట్రంలో కోటి ఎకరాలకు పైగా భూభాగానికి సాగునీరు అందించడం లక్ష్యంగా ప్రభుత్వం అనేక సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యం కల్పిస్తుంది. 37 లక్షల ఎకరాల ఆయకట్టు, పారిశ్రామిక అవసరాలు, హైదరాబాద్ నగరానికి త్రాగునీరు సరఫరా చేసే దిశగా రూపొందించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని రికార్డు సమయంలో పూర్తీ చేశాం. జగిత్యాల జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు లింక్ 2 అదనపు టి.ఎం.సీ. తరలింపు నిర్మాణ పనులు అక్టోబర్ చివరి నాటికీ పూర్తీ చేసే దిశగా పనులు వేగంగా సాగుతున్నాయి.  ఆరోగ్య తెలంగాణ సాధనలో భాగంగా ప్రతీ ఇంటికి సురక్షితమైన తాగునీటిని అందించడానికి ప్రభుత్వం ప్రారంభించిన బృహత్తర పథకం మిషన్ భగీరథ పథకం కింద రూ.1430 కోట్లు ఖర్చు చేసి జిల్లాలోని 5 మున్సిపాలిటిలకు, 18 మండలాలలోని 491 ఆవాసాలకు బల్క్ నీటి సరఫరా అందిస్తున్నాం. 491 ఆవాసాలలో ప్రతీ ఇంటికి నల్ల బిగించి ప్రతీ రోజు నీటి సరఫరా చేస్తున్నాము.
దళిత బంధు  దళితుల సాధికారత సాధన కోసం సీ.ఎం. కేసిఆర్ గారు దళిత బంధు పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో  ప్రతీ దళిత కుటుంబానికి ఎలాంటి బ్యాంకు లింకేజి లేకుండా వ్యాపార యూనిట్ స్థాపనకు రూ. 10 లక్షలను ఉచితంగా అందజేయడం జరిగింది. గత ఆర్థిక సంవత్సరం ప్రతీ అసెంబ్లి నియోజకవర్గ పరిధిలో పైలెట్ ప్రాజెక్టు కింద 100 మంది చొప్పున మన జగిత్యాల జిల్లాలో 345 మంది లబ్దిదారులకు రూ.29 కోట్ల 30 లక్షలను మంజూరు చేసి 345  యూనిట్లు గ్రౌండింగ్ చేయనైనది. ఎస్.సీ  వార్షిక ప్రణాళిక  క్రింద 1133 మంది లబ్దిదారులకు 3106 లక్షలు మంజూరీ చేయడమైనది, అలాగే ఎస్.సీ.   నియోజకవర్గంలో మినీ డైరీని పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేయుచున్నాము, యువతకు వివిధ రకాలైన శిక్షణ కార్యక్రమములు విరివిగా నిర్వహించుచున్నాము.
అటవీ శాఖ (తెలంగాణకు హరిత హారం)  పర్యావరణ సంరక్షణకు మరియు వాతావరణ సమతుల్యం సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రారంభించిన తెలంగాణకు హరిత హారం కార్యక్రమం ద్వారా  2022 సంవత్సరంలో జిల్లాలో 41 లక్షల మొక్కలు నాటడానికి లక్ష్యంకాగా ఇప్పటి వరకు 39 లక్షల మొక్కలను నాటడం జరిగింది. రెండు అర్బన్ ఫారెస్ట్ బ్లాక్ లలో 60 వేల మొక్కలను నాటడం జరిగింది. అటవీ పునరుద్ధరణలో భాగంగా 1032 ఎకరాలలో ప్లాంటేషన్ ఏర్పాటు చేసి 375 ఔషధ మొక్కల పెంపకం చేపట్టడం జరిగింది. స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా వృక్షా బంధన్ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడమే కాకుండా జిల్లా వ్యాప్తంగా ఫ్రీడం పార్కులను ఏర్పాటు చేసి మొక్కలను నాటడం జరిగింది.
జిల్లా గ్రామీణాభివృద్ది శాఖ ఆసరా పెన్షన్లు జిల్లాలోని వృద్దులు, వితంతువులు, ఒంటరి మహిళలకు, చేనేత కార్మికులకు, గీత కార్మికులకు, బీడీ కార్మికులకు, ఎయిడ్స్ మరియు ఫైలేరియ వ్యాధిగ్రస్తులకు రూ.2016/-, దివ్యాంగులకు రూ. 3016/- చొప్పున 2 లక్షల 2 వేల 424  మంది ఫించన్ దారులకు ప్రతీ మాసం రూ. 42 కోట్ల 44 లక్షలుచెల్లించడం జగురుతుంది. మహిళల ఆర్థికాభివృద్దికి ప్రభుత్వం సున్నా వడ్డీ పథకం ద్వారా ఒక్కో స్వశక్తి సంఘానికి రూ. 20 లక్షల వరకు రుణాలు అందిస్తున్నాం. 2022-23 ఆర్ధిక సంవత్సరంలో 12 వేల 496 స్వశక్తి సంఘాలకు రూ. 578.66 కోట్లు లక్ష్యం కాగా, ఆగస్టు 2022 నాటికి 2664 సంఘాలకు రూ. 146.77 కోట్ల రుణాలను బ్యాంకుల ద్వారా ఇప్పించడం జరిగింది., స్త్రీ నిధి ద్వారా 2147 స్వశక్తి సంఘాలకు రూ. 28.47 కోట్ల రుణాలు అందించడం జగిరింది. మహిళ సంఘ సభ్యులను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశ్యంతో 2021-22 సంవత్సరంలో 2800 మందికి అవసరమైన రుణాలు కల్పించి వ్యాపార సంస్థలను ఏర్పాటు చేశాము. ప్రస్తుతం ఆర్ధిక సంవత్సరంలో 4300 మందిని పారిశ్రామిక వేత్తలుగా తాయారు చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేశాము. ఉపాధి హామీ పథకం ద్వారా పని అడిగిన ప్రతీ జాబ్ కార్డు దారునికి 100 రోజుల పని కల్పించడం జరుగుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జిల్లాలో ఇప్పటి వరకు 1,81,150 జాబ్ కార్డుల ద్వారా 20,60,000 పనిదినాలు కల్పించి రూ.1466.83 లక్షలు వేతనాలుగా, రూ. 19.49 లక్షలు మెటిరియల్ ఖర్చుగా మొత్తం రూ. 4071.93 లక్షలు  చెల్లించడం జరిగింది.

జిల్లా పంచాయతీ శాఖ:మహాత్మా గాంధి గారు కలలు కన్నా గ్రామ స్వరాజ్యము అమలు చేయుటలో  గౌరవ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పల్లెను ప్రగతి బాటలో నడిపించుటకై భ్రుహత్తరమైన పల్లె ప్రగతి కార్యక్రమమును ఏర్పాటు చేసి గ్రామాల అభివృద్ధితో పాటుగా గ్రామములో జరిగే ప్రతి పనిలో ప్రజలను భాగస్వామ్యము చేస్తూ గ్రామాలను అభివృద్ధి పథములో ముందుకు తీసుకువెళ్ళడం జరుగుచున్నది. అందులో భాగముగా పల్లె ప్రగతి కార్యక్రమమును నిరంతర ప్రక్రియ కొనసాగించుచూ అవసరమైన నిధులను కేటాయించి గ్రామాలను గాంధిజీ కలలు కన్నా గ్రామాలుగా తీర్చిదిద్దడం జరుగుచున్నది.గత కొన్ని రోజులుగా కురిసిన అతి భారీ వర్షాల వలన గ్రామములలో చెరువులు, కుంటలు నిండు కుండలుగా అయి పొంగి పొర్లడం జరిగినది. ఇట్టి వర్షాల వలన ప్రజలకు ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా గౌరవ రాష్ట్ర ప్రభుత్వమూ నిర్దేశించిన క్రమము ముందస్తు చర్యలు చేపట్టడంతో పాటుగా ప్రజలను సురక్షిత ప్రాంతములకు తరలించి పునరావాసము ఏర్పాటు చేయడము జరిగినది. గౌరవ ప్రజా ప్రతినిధులు మరియు గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆద్వర్యములో జిల్లాలో పనిచేయుచున్న జిల్లా స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయి అధికారులు ఎప్పటి కప్పుడు అప్రమత్తము అగుచు ప్రజలను కాపాడుటలో నిరంతరము శ్రమించడం జరిగినది. ఇట్టి వర్షాకాలము వలన ప్రజలకు ఎలాంటి వ్యాధులు ప్రభలకుండా అవగాహన కల్పిస్తూ  నిరంతరము గ్రామాలలో సానిటేషన్ నిర్వహణ, క్లోరినేషన్ చేయడం జరిగినది. గౌరవ తెలంగాణా ప్రభుత్వము నిర్ణయించిన క్రమము స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భముగా    తేది.08.08.2022 నుండి తేది.22.08.2022 వరకు నిర్దేశించిన షెడ్యుల్ ప్రకారము    75 సంవత్సరముల స్వతంత్ర వజ్రోత్సవాల వేడుకల సంబరాలను వివిధ  కార్యక్రమముల రూపములో  అంగరంగ వైభవముగా అన్ని గ్రామాలలో గౌరవ ప్రజాప్రతినిదులు, అధికారుల సమక్షములో ప్రజలందరినీ భాగస్వామ్యము చేయుచూ దిగ్విజయముగా జరుపుకుంటున్నాం.
మున్సిపల్ అడ్మినేషన్ & అర్చన్ డెవలప్ మెంట్ శాఖ:
పట్టణ ప్రగతి ద్వారా 53.16 కోట్లు విడుదల చెయ్యడం జరిగినది. అందులో 44.65 కోట్లు వివిధ అభివృద్ధి పనులకు ఖర్చు చేసారు.         ఓపెన్ జిమ్స్ ఏర్పాటు చేసి, ప్రజలకు అందుబాటులోకి తేవడం జరుగుచున్నది.      జిల్లా హెడ్ క్వార్టర్లో (2) బస్తీ దవాఖానాలు పూర్తి చేయబడినవి.  అన్ని మున్సిపాలిటీలలో తెలంగాణా క్రీడా ప్రాంగణాలను  ఏర్పాటు చెయ్యడం జరిగుచున్నది జగిత్యాల, కోరుట్ల, మెట్ పల్లి, ధర్మపురిలలో  ఇంటిగ్రేటేడ్ మార్కెట్ అభివృద్ధి పనులు వేగంగా జరుగుచున్నవి.అన్ని మున్సిపాలిటీలలో వైకుంఠ ధామాల పనులు ఆమోదం పొంది వేగంగా జరుగుచున్నవి. TUFIDC క్రింద మంజూరు అయిన పనులను ప్రస్తుతం వేగంగా పూర్తి చేయబడు చున్నవి. ట్రాఫిక్ సిగ్నల్స్, సి సి కెమెరాలు ఏర్పాటు చెయ్యడం జరిగినది.  సెంట్రల్ మీడియన్, జంక్షన్ డెవలప్ మెంట్ పనులు వేరుగా జరుగుచున్నవి.  సానిటేషన్ లో భాగంగా పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా జరుగుటకు కొత్తగా వాహనాలను  కొనుగోలు చేయటం జరిగింది. ఫాగింగ్ మిషన్-లను కొత్తగా కొనుగోలు చేసారు. వైకుంఠ రథాలు అందుబాటులోకి తేవడం జరుగుచున్నది. FSTP & DRCC లను ఏర్పాటు చేసి నిర్వహించటం జరుగుచున్నది.హరితహారంలో భాగంగా 8 లక్షల లక్ష్యంలో భాగంగా ఇప్పటి వరకు 5,57,772 మొక్కలను నాటటం జరిగింది. అందులో భాగంగా ఇంటింటికి 6 మొక్కల పంపిని చేపట్టడం జరుగుచున్నది. దీనికై గ్రీన్ బడ్జెట్ వినియోగించటం జరుగుచున్నది.        వార్డుల వారీగా టీ పార్కులు ఏర్పాటు చేయడం జరుగుచున్నది.భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలలో భాగంగా అన్ని మున్సిపాలిటీలలో ఫ్రీడమ్ పార్క్ లను ఏర్పాటు చేయడం జరిగినది.ప్లాస్టిక్ రహిత పట్టణాలుగా తీర్చిదిద్దుటకు అన్ని మున్సిపాలిటీలలో చర్యలు తీసుకోనబడుచున్నది.స్వఛ సర్వేక్షణ్ లో బాగంగా, తడి చెత్త & పొడి చెత్త వేరు చేయుటకై  మహిళా సంఘాల ద్వారా అవగాహన చేపట్టడం  జరిగుతున్నది ODF+ గా అన్ని మున్సిపాలిటీలను ప్రకటించటం జరిగినది భువన్ జియో ట్యాగింగ్ పూర్తి చేసి 100% చేయటం జరుగుచున్నది.స్ట్రీట్ వెండర్స్ కోసం వెండింగ్ జోన్స్ ఏర్పాటు చేయబడి, త్వరలో వారికి అందుబాటులోకి తేవటం జరుగుతున్నది. ప్రతి ఇంటికీ జాతీయ జెండాలను పంపణీ చేయటం జరిగినది. మొత్తంగా (5) పట్టణాలలో 75346 జెండాలను పంపిణీ చేసారు.

పశు సంవర్ధక శాఖ తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో గల సహజ మానవ వనరులను సద్వినియోగం చేసుకుంటూ సంపద సృష్టించాలనే లక్ష్యంతో ప్రభుత్వం గొర్రెల పంపిణి కార్యక్రమం ప్రారంభించింది. 75 శాతం సబ్సిడిపై జిల్లాలో ఇప్పటి వరకు రూ. 228 కోట్లు వినియోగించి 17, 450 గొర్రెల యూనిట్లను పంపిణి చేశాం. ప్రతీ గొర్రెకు భీమా  సదుపాయం కల్పించాం.

మత్స్యశాఖ కుల వృత్తినే జీవనోపాధిగా చేసుకొని జీవితం కొనసాగించే మత్స్య కారుల సంక్షేమ కోసం 2022-23 సంవత్సరంలో జిల్లాలో మత్స్య సమీకృత అభివృద్ధి పథకం కింద వంద శాతం సబ్సిడిపై  10.50 లక్షల  రొయ్య పిల్లలు, 111.48 లక్షల చేప పిల్లలు పంపిణి చేయడం జరిగింది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద 40 శాతం సబ్సిడి పై 53 యూనిట్ల మంజురుకై ప్రతిపాదనలు పంపనైనది. అంతేకాకుండా 26 చేపల చెరువు నిర్మాణానికి నిధులు మరియు, సంచార చేపల విక్రయ వాహనాలను  మంజూరు చేశాం.
విద్యుత్ శాఖ  విద్యుత్ సరఫరాకు సంబంధించి  జిల్లాలో 1 లక్ష 33 వేల 214 వ్యవసాయ బావులకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నాం. ఇందుకోసం ప్రభుత్వం ప్రతి సంవత్సరం 100 కోట్లకు పైగా సబ్సిడి భరిస్తుంది. జిల్లాలో ప్రతి వినియోగదారునికి కోతలు లేకుండా 24 గంటల విద్యుత్ ను అందిస్తున్నాం. లోవోల్టేజి సమస్యలను తీర్చడం కోసం గత ఆర్థిక సంవత్సరంలో 296 కొత్త ట్రాన్స్ ఫార్మర్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటివరకు 79 కొత్త ట్రాన్స్ ఫార్మర్లను బిగించాం.  దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ జ్యోతి యోజన పథకం కింద 1559 గృహాలకు మరియు సహజ బిజ్లి ఘర్ (సౌభాగ్య) పథకం కింద 4140 ఇండ్లకు 100 శాతం  విద్యుద్దీకరణ చేయడం జరిగింది. జిల్లాలో వంగిపోయిన, చెడిపోయిన  స్తంభాలను, లూజ్ వైర్లను గుర్తించి వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాలో నిర్మించిన 70 రైతు వేదికలకు 44 లక్షల ఖర్చుతో కొత్త విద్యుత్ కనెక్షన్లను ఇవ్వడం జరిగింది. 652 నాయి బ్రాహ్మణులకు మరియు 1578 రజక వృత్తులకు కొత్త కనెక్షన్లు మంజూరు చేయడమే కాకుండా వీరికి నెలకు 250 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు వాడుకోవడానికి ప్రభుత్వం సబ్సిడి ఇస్తుంది.
రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణం నిరుపేదలు అర్మగౌరవంతో జీవించాలనే సదుద్దేశంతో ప్రభుత్వం పేదలకు రెండు పడక గదుల ఇండ్ల పథకాన్ని ప్రారంభించింది. జగిత్యాల జిల్లాలో రూ. 497 కోట్ల 77 లక్షల వ్యయంతో 8 వేల  525 రెండు పడక గదుల ఇండ్లను లబ్దిదారులకు పంపిణి చేశాం.  336 గృహాలు పంపిణీకి సిద్దంగా ఉన్నాయి.
రోడ్లు మరియు  భవనాల శాఖ ద్వారా జిల్లాలో సింగిల్ లైన్ రోడ్లను డబల్ లైన్ రోడ్లుగా మార్చుటకు రూ. 25 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. పనులు ప్రగతి లో ఉన్నాయి. హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం కొరకు రూ. 8.06 కోట్లతో చేపట్టిన రెండు పనులు పురోగతిలో ఉన్నాయి. జిల్లా కలెక్టర్ సమీకృత భవనాల సముదాయం పనులు రూ. 58.35 కోట్లతో మంజూరు అయి పనులు పూర్తీ అయి ప్రారంభానికి సిద్దంగా ఉన్నాయి. జిల్లాలో మెడికల్ కాలేజి  కొరకు రూ. 510.00 కోట్లు మంజూరు కాగా పనులు ప్రగతిలో ఉన్నాయి.
సాంఘిక సంక్షేమ (ఎస్సి) శాఖ
జిల్లాలో ఎస్సి సంక్షేమ శాఖ కింద నిర్వహిస్తున్న 12 బాలుర, 7 బాలికల వసతి గృహాల్లో  678  మంది విద్యార్థిని,  విద్యార్థులు వసతి పొందుతున్నారు. అంబేద్కర్ ఓవర్సీస్ విద్య నిధి పథకం కింద 2021-22 ఆర్ధిక సంవత్సరం జిల్లాలో ఒక్కొక్కరికి 20,00,000 నిధుల చొప్పున 5 గురు విద్యార్థులు, 15 కులాంతర వివాహ జంటలకు రూ.2 లక్షల 50  వేల  చొప్పున రూ. 35 లక్షల 50  వేలు పంపిణి చేశాం. బెస్ట్ అవలేబుల్ స్కూల్ పథకం కింద 57 మందిని వారు ఎంచుకున్న పాఠశాలలో ప్రవేశం కల్పించడం జరిగింది. జిల్లాలో ఎస్సి స్టడి సర్కిల్ ఏర్పాటు చేసాము. ప్రస్తుతం 100 మంది విద్యార్థులకు ఉద్యోగ సాధనకోసం వసతితో పాటు ఉచిత శిక్షణ అందిస్తున్నాం.  వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ జిల్లాలో బిసి అభివృద్ధి శాఖ ద్వారా నిర్వహిస్తున్న వసతి గృహాల్లో 440 విద్యార్థిని విద్యార్థులు వసతి పొందుతున్నారు. కులాంతర వివాహాలు ప్రోత్సాహకం మరియు విద్యార్థులకు ఫీజు రియంబర్స్ మెంట్, పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలు పంపిణి చేసాము.
మైనారిటి సంక్షేమ శాఖ జిల్లాలో ఏర్పాటు చేసిన 5 గురుకుల పాఠశాలలను 3200 సీట్ల సామర్థ్యంతో  రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలగా అప్ గ్రేడ్ చేసాము. ఉపకార వేతనం, ఫీజు రియంబర్స్ మెంట్ పథకం కింద 2022-23 సంవత్సరంలో జిల్లాలోని మైనార్టి విద్యార్థులకు రూ.28.56 లక్షలను మొదటి విడుత బడ్జెట్ లో మంజూరు మరియు రూ. 33.48 లక్షలను రెండవ విడుతలో  మంజూరు చేశాం. జిల్లాలోని ఎస్సి, బిసి, మైనారిటీ యువతకు నాణ్యమైన ట్రైనర్లతో గ్రూప్ పరీక్షలకు శిక్షణ పూర్తీ ఉచితంగా అందిస్తున్నాం.టి.ఎస్.ఐ.పాస్  రాష్ట్ర ఆర్థికాభివృద్దికి, పారిశ్రామిక అభివృద్ధి చాలా కీలకమైనది. రాష్ట్రానికి అత్యధిక పెట్టుబడులు తీసుకొని రావడానికి రూపొందించిన నూతన పారిశ్రామిక విధానం టి.ఎస్.ఐ.పాస్. జిల్లాలో రూ. 804 కోట్ల పెట్టుబడితో 8976 మందికి ఉపాధి కల్పించేందుకు 1124 యూనిట్లు అనుమతి ఇచ్చాం. టి ఫ్రైడ్  పథకం కింద జిల్లాలో 214 ఎస్సి, ఎస్టి అభ్యర్థులకు పెట్టుబడి రాయితీ కింది రూ.18.14 కోట్లు మంజూరు చేశాము.
కళ్యాణ లక్ష్మి/షాదీ ముబారక్కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా ఆడపిల్ల పెండ్లి భారాన్ని ప్రభుత్వం పంచుకోవడంతో నిరుపేద ఆడపిల్లల తల్లిదండ్రులు ఎంతో ఊరట పొందుతున్నారు. జిల్లాలో 2021-22 ఆర్థిక సంవత్సరంలో 6,830  బీసీలకు, 579 ఇబీసిలకు, 198 ఎస్టిలకు, 1061 ఎస్సిలకు, 492 మైనారిటీలకు రూ. 87 కోట్ల 25 లక్షలు పంపిణి చేశాం. తద్వారా  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 44 ఎస్టిలకు, 431 ఎస్సిలకు, 203 మైనారిటీలకు 6  కోట్ల 78 లక్షలు మంజూరు చేయడం జరిగింది.
స్త్రీ శిశు, దివ్యాంగుల సంక్షేమ శాఖ
ఆరోగ్య లక్ష్మి  పథకం ద్వారా జిల్లాలోని 1065 అంగన్ వాడి కేంద్రాల ద్వారా 9225 మంది గర్భవతులు, 7152 బాలింతలకు, 0-5 సంవత్సరాలలోపు వయసు గల 57902 మంది పిల్లలకు పౌష్టికాహారంతో పాటు పూర్వ ప్రాథమిక విద్యనూ అందిస్తున్నాం. మహిళా రక్షణకు ఏర్పాటు చేసిన సఖి కేంద్రం ద్వారా 1166 బాధిత మహిళలకు 5 రకాల సేవలు అందించడం జరుగుతుంది. జిల్లాలోని దివ్యాంగులు ఎవరి ఆసరా లేకుండా స్వయం జీవనం గడపడానికి 499 బ్యాటరి ట్రై సైకిళ్ళు, 48 రిట్రో ఫిట్టేడ్ స్కూటీలు, 19 బ్యాటరీ వీల్ చైర్ లు , 21 ల్యాప్ ట్యాప్ లు, 37 స్మార్ట్ ఫోన్లు, 61 వినికిడి యంత్రాలు పూర్తి ఉచితంగా అందించాము.
జిల్లా పౌర సరఫరాల శాఖ  రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికి నెలకు 6 కిలోల చొప్పున కుటుంబంలో ఎంతమంది సభ్యులుంటే అంతమందికి ఎటువంటి పరిమితి విధించకుండా బియ్యం ప్రభుత్వం అందిస్తుంది. జిల్లా పౌర సరఫరాల శాఖ ద్వారా అవినీతికి తావులేకుండా ఈ-పాస్ యంత్రాల ద్వారా 592 చౌక ధరల దుకాణాల నుండి బియ్యం  సరఫరా చేస్తున్నాం. ప్రస్తుతం యాసంగి పంటలో 364 ఐ.కే.పి. మరియు పి.ఏ.సీ.ఎస్. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరపై రూ. 572.59 కోట్ల విలువ గల 2 లక్షల 92 వేల  167 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది.
వివిధ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల వద్దకు తీసుకువెళ్ళి వాటి విజయవంతానికి కృషి చేస్తున్న ప్రజా ప్రతినిధులు, అధికారులు, న్యాయాధికారులకు స్వాతంత్య్ర సమరయోధులకు, పోలీస్ అధికారులకు, సిబ్బందికి అభినందనలు.
నిరంతరం ప్రజలలో అవగాహన పెంపొందిస్తూ, చైతన్యంతో ముందుండే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు, స్వచ్చంద సంస్థలకు, ప్రజలందరికి  ధన్యవాదాలు తెలుపుతున్నాను.
75 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అందరికి మరోసారి శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై హింద్- జై తెలంగాణ
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం,      జగిత్యాల జిల్లా