భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

bse-gain

స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ల నెగటివ్ ట్రేడింగ్ తో పాటూ, దేశీయ ఆర్థిక గణాంకాలు అంచనాల కంటే బలహీనంగా నమోదవ్వడంతో మార్కెట్లు భారీగా నష్టపోయాయి. దీంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 300 పాయింట్ల నష్టంతో 25వేల 489 దగ్గర ముగిసింది. అటు నేషనల్ స్టాక్‌ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 85 పాయింట్ల నష్టంతో 7వేల 815 దగ్గర క్లోజయింది. యూకో బ్యాంక్, నెస్లే ఇండియా, పొలారిస్ షేర్లు నష్టపోగా, మణప్పురం, నెట్ వర్క్ 18 షేర్లు భారీగా లాభపడ్డాయి.