*భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి*

తెలంగాణ రైతాంగ సమితి డిమాండ్.
గద్వాల నడిగడ్డ, జులై 14 (జనం సాక్షి);
 గత వారం రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల తెలంగాణ రాష్ట్రంలో వివిధ జిల్లాలలో 20 లక్షల ఎకరాలకు పైగా నష్టం జరిగిందనీ వారికి ఎకరాకు 20 వేల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని గురువారము తెలంగాణ రైతాంగ సమితి రాష్ట్ర అధ్యక్షుడు జక్కుల వెంకటయ్య, ప్రధాన కార్యదర్శి గోపాల్  ఒక ప్రకటనలో  తెలిపారు. పత్తి,వరి, సోయాబీన్, కంది, మొక్కజొన్న,పెసర, మినుము, తదితర పంటలు నీట మునిగి నష్టపోయాయనీ, ఉత్తర తెలంగాణ జిల్లాలలో పత్తి పంట లక్షలాది ఎకరాలలో నీట మునిగిందనీ, రాష్ట్రంలో ఆయా జిల్లాల్లో వరి నార్లు వేశారనీ, ఈ వర్షాల వల్ల వరి నార్లు మునిగి వరదలలో కొట్టుకుపోయాయనీ,
మడులు ,కట్టలు తెగి గండ్లు పడ్డాయనీ,ఆరుతడి పంటలు సోయాబీన్, మొక్కజొన్న, కంది, పెసర, మినుముల పంటలన్నీ నీట మునిగి తీవ్ర నష్ట జరిగిందనీ, దక్షిణ తెలంగాణ జిల్లాలలో వరి నార్లు పోశారనీ, భారీ వర్షాల వల్ల రోజు వర్షం కురవడం వల్ల పోసిన నార్లు దెబ్బతిన్నాయనీ, తిరిగి వరి నారులు పోసుకోవాలనీ, దున్నిన భూములు నెర్రెలు  ఇచ్చి గండ్లు పడ్డాయనీ,తెలంగాణ ప్రభుత్వం ప్రతి నష్టాన్ని రైతుబంధు తో ముడిపెట్టి ఎటువంటి నష్టపరిహారం ఇవ్వడం లేదనీ, రైతు బందును సర్వరోగ నివారిణిగా ప్రభుత్వం చెబుతుందనీ, రైతు సమస్యలు ఇతర సబ్సిడీలను కానీ నష్టపరిహారాలు కానీ పట్టించుకోవడం లేదనీ, భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు 20 వేల నష్ట పరిహారం ఇవ్వాలనీ వారు డిమాండ్ చేశారు.