భా.జ.పా, నాయకులు ముందస్తు అరెస్టు

తొర్రూర్ 23 ఆగస్టు( జనంసాక్షి ) బి.జే.పీ, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ను అడ్డుకుని అక్రమం గా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ   బిజెపి నిరసనల కు పిలుపు నిచ్చిన నేపథ్యం లో ఈ రోజు తొర్రూర్ లో పోలీసులు బీజేపీ నాయకుల ను ముందస్తు అరెస్టు చేసి అనంతరం సొంత పూచికత్తు పై విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భం గా బిజెపి రాష్ట్ర నాయకులు నియోజకవర్గ ఇన్చార్జి పెదగాని సోమయ్య మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  పాదయాత్ర ను అడ్డుకుని అక్రమం గా అరెస్టు చేయడాన్ని తీవ్రం గా ఖండిస్తున్నామని తెలిపారు.డిల్లీ లిక్కర్ స్కాం లో కేసీఆర్ కూతురు కవిత పేరు బయట కు రావడం తో ప్రజల ద్రృష్టిని మరల్చడం కోసం బండి సంజయ్  చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ను అడ్డుకుని అక్రమం గా అరెస్టు చేశారు అని తెలిపారు.బండి సంజయ్  పాదయాత్ర తో టీఆర్ఎస్ నేతల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది అని తెలిపారు.ప్రజల లో రోజు రోజుకూ బీజేపీ పట్ల ఆదరణ పెరుగుతోంది దానిని ఓర్చుకోలేక బీజేపీ నేతల పై అక్రమ కేసులు బనాయిస్తూ భయ బ్రాంతుల కు గురి చేస్తూ రాష్ట్రం లో నిరంకుశ అహంకార పాలన చేస్తూ ప్రజల గొంతు ను నొక్కుతూ ప్రజాస్వామ్య హక్కులను తెగనరికి కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు అని తెలిపారు.ప్రశ్నించే గొంతుకల ను అక్రమం గా అరెస్టు చేసి అణిచి వేయడం తగదని హితవు పలికారు.కేసిఆర్ కు చిత్తశుద్ధి ఉంటే లిక్కర్ స్కాం లో  ఆరోపణలు ఎదుర్కొంటున్న  తన కూతురు కవిత ను వెంటనే ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.కేసిఆర్ సర్కారు కు రోజులు దగ్గర పడ్డాయి అని, రాబోయే రోజుల్లో రాష్ట్రం లో బీజేపీ నేతృత్వం లో పేదల ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం అని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం లో బిజెపి తొర్రూరు మున్సిపాలిటీ శాఖ అధ్యక్షుడు పల్లె కుమార్, జిల్లా కార్యదర్శులు పరుపాటి రాం మోహన్ రెడ్డి, రచ్చ కుమార్,15 వ వార్డు కౌన్సిలర్ కొలుపుల శంకర్,రూరల్ మండలం అధ్యక్షుడు బొచ్చు సురేష్,యం. హరీష్ తదితరులు పాల్గొన్నారు.