భూగర్భ జలాల పరిరక్షణ మన బాధ్యత కావాలి
కరీంనగర్,జూన్14(జనం సాక్షి): భూగర్భజలాలను పరిరక్షించే క్రమంలో జిల్లా రాష్ట్రానికే ఆదర్శంగా నిలువాలంటే ప్రతి ఒక్కరూ ఇంటిలో ఇంకుడు గుంత, మురుదొడ్డి నిర్మాణం, ఇంటి ముందు కనీసం ఐదు మొక్కలను పెంచాలని జడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ అన్నారు. గ్రామంలోని అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. దత్తత గ్రామాలు అన్నిరంగాల్లో అభివృద్ధికి తన సహాయ సహాకారాలు ఎల్లవేళలా ఉంటాయన్నారు.గ్రావిూణ ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని, వాటిద్వారానే మనం రాస్ట అభివృద్దిని సాధించగలమని తుల ఉమ అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో గ్రావిూణ ప్రాంతాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినప్పుడే కేసీఆర్ కలలు గన్న బంగారు తెలంగాణ సాధ్యమవుతుందన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానికి జలవనరుల సంఘం ఆమోదించడం ద్వారా ఇక పనులు మరింత శరవేగంగా పూర్తి కానున్నాయని తెలిపారు. . సీఎం కేసీఆర్ తాగు, సాగు నీటి కోసం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. అదే మన భవిష్యత్ తరాలకు మార్గసూచి అన్నారు. జలం వృథాగా పోకుండా ప్రతిబొట్టును వినియోగించుకోవాలని ఉద్యమ స్ఫూర్తితో ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపడుతున్నారు. ఎస్సారెస్పీ కింద ఆయకట్టు రైతులు రెండు పంటలను పండించు కోవచ్చు. మంత్రి హరీశ్‌రావు ఆధ్వర్యంలో నిరంతర పర్యవేక్షింస్తూ ప్రాజె క్టు పనులు వేగవంతం చేస్తున్నారు. దీంతో దేశచరిత్రలో తలమానికంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిలిచిపోవాలనే సీఎం కేసీఆర్ కల సాకారం కానుందన్నారు. యువత చేతిలోనే దేశ భవిష్యత్ ఉందని అన్నారు. రైతు బంధు,రైతు బీమా పథకాలతో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిందన్నారు. కాంగ్రెస్ పార్టీ దిమ్మె తిరిగే విధంగా ప్రతిరోజు ఏదో ఒక గ్రామం నుంచి టీఆర్ఎస్లో చేరికలు జరుగుతూనే ఉన్నాయన్నారు. యువత మొత్తం బంగారు తెలంగాణ రాష్ట్రానికి నాంది పలకడంలో భాగంగా కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వానికి జేజేలు పలుకుతున్నారన్నారు.
నినినీ