మండల ఏర్పాటుకు స్పష్టమైన హామీ ఇవ్వాలి
ఎర్రవల్లి సర్పంచ్ జోగుల రవి
ఇటిక్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 1 : ఎర్రవల్లి గ్రామ పంచాయతీని మండల కేంద్రంగా ప్రకటించేందుకు లిఖిత పూర్వంగా స్పష్టమైన హామీ ఇవ్వాలని ఎర్రవల్లి సర్పంచ్ జోగుల రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం మండల పరిధిలోని ఎర్రవల్లి చౌరస్తాలో అఖిలపక్షం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. అన్ని హాంగులు కలిగి ఉన్న ఎర్రవల్లిని మండల కేంద్రం చేసేందుకు జాప్యంచేస్తూ నిర్దిష్టమైన గడువు ప్రకటించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యహిస్తే అఖిలపక్షం ఆధ్వర్యంలో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొండపేట నరసింహులు, బీజేపీ దళిత మోర్చా జిల్లా కార్యదర్శి సంపత్ కుమార్, బీజేవైఎం మాజీ అధ్యక్షులు దశరథంసాగర్, బీజేవైఎం మండల అధ్యక్షులు రాజేష్ మండల ఉపాధ్యక్షులు శంకర్ రెడ్డిలు పాల్గొన్నారు.