మండల మేస్త్రి సంఘం అధ్యక్షునిగా శివకుమార్

లింగంపేట్ 07 ఆగస్టు (జనంసాక్షి)
లింగంపేట్ మండలం మేస్త్రి సంఘం అధ్యక్షుడిగా మాసుల శివకుమార్ ను ఎన్నుకోవడం జరిగిందని మేస్త్రి సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రామికరత్న అవార్డు గ్రహీత బొడ్డు బాలయ్య తెలిపారు.ఆదివారం లింగంపేట్ మండల కేంద్రంలోని మేస్త్రీ సంఘం సమావేశం ఏర్పాటు చేశామన్నారు.మండలంలోని వివిధ గ్రామాల మేస్త్రి సంఘం, మండల సంఘం సభ్యుల నిర్ణయం మేరకు నూతన మండల అధ్యక్షుడిని ఎన్నుకోవడం జరిగిందన్నారు.అందరి అభిష్టం మేరకు పోల్కంపేట్ గ్రామానికి చెందిన మాసుల శివకుమార్ ను మండల మేస్త్రి సంఘం అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగిందన్నారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నుకోబడిన మేస్త్రీ సంఘం అధ్యక్షులు మాసుల శివకుమార్ మాట్లాడుతు సంఘం బలోపేతానికి కృషి చేస్తూ మేస్త్రీ కార్మికులకు అందుబాటులో ఉంటానన్నారు.