మండల వ్యాప్తంగా అఖిలపక్షాల ఆధ్వర్యంలో విజయవంతమైన బంద్.

బూర్గంపహాడ్ ఆగష్టు 29 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో సోమవారం మండల బంధు కార్యక్రమం విజయవంతమవడంలో సహకరించిన వ్యాపారస్తులకు, రైతులకు మహిళలకు, పెద్దలకు, ఆటో యూనియన్, యువకులకు అన్ని వర్గాల ప్రజలకు ధన్యవాదములు జేఏసీ కమిటీ తెలియజేశారు.11వ రోజు దీక్షలో భాగంగా ఎనిమిదవ వార్డు సభ్యులు తోకల అనిత, 9వ వార్డు సభ్యులు గోనెల దుర్గ, తోకల సతీష్, గోనెల వెంకన్న, ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలు పురుషులు దీక్షలో పాల్గొన్నారు. దీక్షలో పాల్గొన్న వారికి టిడిపి నాయకురాలు తాతా మాధవి లత మహిళ, ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే కుంజా బిక్షం సతీమణి కుంజా వెంకటరమణ, ఆకుల పద్మ తదితరులు పూలమాలు అందించి దీక్షను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముంపు ప్రాంత ప్రజల సమస్యను త్వరగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అఖిలపక్ష రాజకీయ నాయకులందరూ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. సమస్య పరిష్కారం దిశగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అఖిలపక్ష నాయకులందరూ బూర్గంపహాడ్ మండల ప్రాంతాన్ని పోలవరం ముంపు బాధిత ప్రాంతంగా గుర్తించాలని, త్వరలో పోలవరం అథారిటీ కమిటీ ఏర్పాటుచేసి, సర్వే నిర్వహించి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ప్రకటించాలని నినదించారు. బంద్ కార్యక్రమంలో పాల్గొని దీక్షలో పాల్గొని సంఘీభావం తెలిపిన నాయకులు, గ్రామ ప్రజలు, కాంగ్రెస్ మండల అధ్యక్షులు కృష్ణారెడ్డి, నియోజకవర్గ నాయకులు బట్టా విజయ గాంధీ, నాయకులు పూలపల్లి సుధాకర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు మంద నాగరాజు, మహిళా నాయకురాలు బర్ల నాగమణి, టిడిపి మండల అధ్యక్షులు తాళ్లూరి జగదీష్, ఆకుల పద్మ, సిపిఎం మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు, బయ్య రాము, సిపిఐ సత్యనారాయణ, జిల్లా నాయకులు పేరాల శ్రీను, మండల కార్యదర్శి మువ్వా వెంకటేశ్వరావు, ముదిగొండ బాలకృష్ణ, బిజెపి మండల అధ్యక్షులు చుక్కపల్లి బాలాజీ, బిజెపి కిషన్, రాష్ట్ర నాయకులు ఏనుగుల వెంకటరెడ్డి, న్యూ సెంచరీ విద్యాసంస్థల అధినేత లైక్ ఆశిక్, చిప్పా రాజు, ఏఐవైఎఫ్ నాయకులు హుజూర్, ఆటో యూనియన్ నాయకులు కన్నా శ్రీను, గద్దల వీరయ్య, టిడిపి భాస్కర్, భజన సతీష్, మున్న మొహమ్మద్, బాబా షేక్, ఎడారి రాంబాబు, ఇసంపల్లి వెంకటేశ్వర్లు, బాచి, దాసరి సాంబ, బూపల్లి నరసింహారావు, జెక్కం సుబ్రహ్మణ్యం, తోకలు సతీష్, గోనెల వెంకన్న, బబ్బు రాయుడు, వెంకటేశ్వర్లు, కేసుపాక రామకృష్ణ, తోకల రవి, ప్రసాద్, రామ తులసి, గౌసియా బేగం, తదితరులు పాల్గొన్నారు.