మండుటెండలో మానవహారం
– గౌరవ వేతనం వద్దు.. పేస్కేలు ముద్దు..
– వీఆర్ఏ జేఏసీ అధ్యక్షులు బాలకృష్ణ
డోర్నకల్ ఆగస్టు 22 జనం సాక్షి
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలో తమ సమస్యలు పరిష్కరించాలని 29 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న వీఆర్ఏలు సోమవారం నిరసన ప్రదర్శన చేపట్టారు.తాసిల్దార్ కార్యాలయం నుంచి ప్రధాన వీధి మీదుగా నిరసన ప్రదర్శన జరిపి గాంధీ సెంటర్లో మండుటెండలో మానవహారం జరిపారు.ఈ సందర్భంగా వీఆర్ఏ జేఏసీ మండలాధ్యక్షులు అలేటి బాలకృష్ణ మాట్లాడుతూ..తెలంగాణ ఉద్యమం సందర్భంలో స్వరాష్ట్రం కోసం ఆందోళన చేశామని,ఇప్పుడు రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా తమ హక్కుల కోసం పోరాడాల్సి వస్తున్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.వీఆర్ఏలకు పేస్కే ల్ జీవో జారీ చేయాలని, ప్రమోషన్లు,వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.తొలుత నిరసన ర్యాలీకి వ్యవసాయ సంఘం బొబ్బ వెంకటరెడ్డి,ఉప్పరపల్లి శ్రీనివాస్,సిఐటియు నాయకులు దాసరి మల్లేశం మద్దతు పలికారు. కార్యక్రమంలో సురేష్,యాదగిరి, గోపరాజ్,డ్యానియెల్,సాయిరాం, కవిత,భారతి,రామకృష్ణ,శేఖర్ తదితరులు పాల్గొన్నారు.