మంత్రి జోగురామన్నకు తప్పిన ముప్పు
– ఓవర్ లోడ్‌తో తెగికిందకు పడిన లిఫ్ట్
మంచిర్యాల, జులై30(జనం సాక్షి): మంత్రి జోగురామన్నకు ఘోర ప్రమాదం తప్పింది. మంచిర్యాల జిల్లాలో సోమవారం ఓ ప్రైవేటు ఆస్పత్రి ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన మంత్రి జోగురామన్న హాజరయ్యారు. ఈ క్రమంలో లిఫ్ట్ ఎక్కిన మంత్రి మొదటి ఫ్లోర్‌లోకి వెళ్లగానే తెగి కిందకు పడిపోయింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఏవిూ కాలేదు. ఓవర్ లోడ్ వల్లే లిఫ్ట్ కిందకు జారింది. మంత్రి వెంట ఎమ్మెల్యేలు దివాకర్ రావు, దుర్గం చిన్నయ్యలు కూడా ఉన్నారు. పరిమితికి మించి ఎక్కువ మంది ఎక్కడంతోనే ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా నిర్థారణకు వచ్చారు. అనంతరం యథావిధిగా ఆసుపత్రి ప్రారంభోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. గతంలో కూడా మంత్రి జోగురామన్న రెండు సార్లు ప్రమాదం నుంచి బయటపడ్డారు. కాపు సంఘం భవనం శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన అగ్నిప్రమాదం నుంచి ఓసారి బయటపడ్డారు. ఆ తరువాత వరంగల్ వెళ్లి వస్తూ ఉండగా ఆయన కాన్వాయ్‌కు టిప్పర్‌లు అడ్డురావడంతో జోగురామన్న కారు పొలాల్లోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదం నుంచి ఆయన క్షేమంగా బయటపడ్డారు.