మక్కాలో మహా విషాదం
– 700మందికి పైగా హాజీల మృతి
– క్షతగ్రాతులను ఆస్పత్రులకు తరలించి ముమ్మరంగా సహాయక చర్యలు
షార్జా,సెప్టెంబర్ 24 (జనంసాక్షి):
ముస్లింల పవిత్ర పుణ్యక్షేత్రం మక్కాలో ఘోరం జరిగింది. కనీవినీ ఎరుగని రీతిలో జరిగిన తొక్కిసలాటలో కనసీం 700 లకు చేరుకుంది.ఈ ప్రమాదంలో మరో 450 మంది వరకూ గాయపడినట్లు సౌదీ అరేబియా విూడియా వెల్లడించింది. హజ్ యాత్రలో ఘోర ప్రమాదం చోటుచేసుకోవడంతో ప్రపంచ వ్యాప్తంగాగ్భ్భ్రాంతి వ్యక్తం అయ్యింది. సౌదీ అరేబియాలోని మక్కాలో తొక్కిసలాట జరిగి తొలుత 150 మందికి పైగా మృతిచెందారని సమాచారం వచ్చింది. అయితే మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ వచ్చింది. ముస్లింల హజ్ యాత్ర బుధవారం ప్రారంభమైంది. ప్రతి ఏడాది జరిగే ఈ యాత్రకు ప్రపంచ దేశాలనుంచి లక్షలాది ముస్లింలు ఇక్కడికి వస్తుంటారు. సైతాన్‌ను రాళ్లతో కొట్టే ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. హజ్ యాత్రలో చివరి ప్రధాన కర్మ అయిన సైతాన్‌ను రాళ్ళతో కొట్టేందుకు యాత్రికులు ఒక్కసారిగా ఎగబడటంతో ఈ ప్రమాదం జరిగింది. యాత్రికులు ఒక్కుదుటున తోసుకుని ముందుకు రావడంతో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఇటీవలే మక్కాలో క్రేన్ కూలి 107 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి మరవక ముందే మళ్లీ ఘోరవిషాదం చోటు చేసుకుంది. ఒకే నెలలో మక్కాలో రెండు ఘోర ప్రమాదాలు జరిగాయి. ఈ ఏడాది హజ్ యాత్రకు 1.50 లక్షల మంది భారతీయులు వెళ్లినట్లు సమాచారం. ఘటన జరిగిన ప్రాంతంలో సుమారు 20వేల మందికి పైగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. క్షతగాత్రులందరినీ హుటాహుటిని సవిూపంలోని ఆస్పత్రులకు తరలించారు. మక్కాలోని అన్ని ఆస్పత్రుల వద్ద అత్యవసర స్థితిని ప్రభుత్వం ప్రకటించింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. మక్కాకు 5 కి.విూ. దూరంలోని విూనాలో ఈ దారుణం గురువారం సంభవించింది. 220 అంబులెన్స్‌లు, 4 వేల మంది సిబ్బందితో సహాయ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని సౌదీ అధికారులు తెలిపారు. క్షతగాత్రులను వివిధ ఆసుపత్రులకు తరలించారు. అన్ని ఆసుపత్రుల వద్ద అత్యవసర పరిస్థితి ప్రకటించారు. కొంత మందికి సంచార వైద్యశాలల్లో చికిత్స అందిస్తున్నారు. బుధవారం నాడు హజ్ యాత్రికులు సౌదీలోని పవిత్ర స్థలమైన ముజదలీఫాకు చేరుకొని ప్రధాన కర్మ నిమిత్తం అక్కడ గులక రాళ్ళను ఏరుకున్నారు. వారు రాళ్ళతో సైతాన్‌ను కొట్టే నేటి రోజు త్యాగానికి గుర్తుగా ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల మంది ముస్లింలు జరుపుకునే ఈద్ అల్ అధా పర్వ దినం కూడా. ముజదలీఫా తర్వాత కొందరు యాత్రికులు పవిత్ర కాబా చుట్టడానికి వెళ్ళగా మిగతా వారు విూనాకు చేరుకున్నారు. హజ్ యాత్రలో చివరి మజిలీ ఈ నగరం. విూనాలోనే రాళ్ళతో సైతాన్‌ను కొట్టే కర్మను నిర్వర్తిస్తారు. దాదాపు 20 లక్షల మంది విదేశీ యాత్రికులు హజ్ యాత్ర నిమిత్తం సౌదీ అరేబియాకు వచ్చినట్లు సమాచారం. 2001లో కూడా ఇదే విధంగా తొక్కిసలాట జరిగి హజ్ యాత్రలో 360 మంది చనిపోయారు.
సహాయకచర్యలు ముమ్మరం
మక్కాలో సంభవించిన ఘోర ప్రమాద ప్రాంతంలో సౌదీ పౌర రక్షణ అధికారులు సహాయక చర్యలు
చేపట్టారు. క్షతగాత్రులను హుటాహుటిన వివిధ ఆస్పత్రులకు తరలించారు. సౌదీ అధికారులతో పాటు వైద్య బృందాలు సహాయచర్యల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. మృతుల, క్షతగాత్రుల వివరాలను తెలుసుకునేందుకు అక్కడి ప్రభుత్వం హెల్ప్‌లైన్ నంబర్లు తెలియజేసింది. 00966125458000, 00966125496000 నంబర్లకు ఫోన్‌చేసి సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 700ల మందికి పైగా మృతిచెందారు.ఈ ప్రమాదంలో మరో 450 మంది వరకూ గాయపడినట్లు సౌదీ అరేబియా విూడియా వెల్లడించింది.
మక్కా ఘటనపై సవిూక్షిస్తున్న విదేశాంగ శాఖ
మక్కాలో జరిగిన ఘోర ప్రమాదంపై సవిూక్షిస్తున్నామని.. వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు మృతులకు సంబంధించి పూర్తి సమాచారం తెలియలేదని పేర్కొంది. మక్కాలో భారతీయుల పరిస్థితికి సంబంధించి ఆరా తీస్తున్నామని, నిరంతరం సమాచారం తెలుసుకుంటున్నామని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు.
ఘటనపై సీఎం కేసీఆర్‌గ్భ్భ్రాంతి
మక్కాలో తొక్కిసలాట జరిగి 3100 మంది యాత్రికులు మృతిచెందడం పట్ల సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుగ్భ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తెలంగాణ నుంచి వెళ్లిన వారి గురించి తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు. జెడ్డాలోని భారత రాయబార అధికారులను సంప్రదించాలని పేర్కొన్నారు. దీంతో జెడ్డాలోని భారత కాన్సులేట్‌ను అధికారులు సంప్రదిస్తున్నారు.
మంత్రి పల్లె దిగ్భ్రాంతి
సౌదీ అరేబియాలోని మక్కా వద్దహజ్‌యాత్రలో జరిగిన తొక్కిసలాట విషాదం చాలా బాధించిందని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖమంత్రి ప్లలె రఘునాథ్‌రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ యాత్రికులు ఎంతమంది ఉన్నారో వివరాలు తెలుసుకుంటున్నట్లు చెప్పారు. అందరినీ సురక్షితంగా తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయమై అక్కడి రాయబారకార్యాలయాన్ని సంప్రదిస్తున్నామని చెప్పారు. పవిత్ర హజ్ యాత్రలో తొక్కిసలాట జరిగి వందలాది ప్రజలు మరణించడంపై జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాగ్భ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబసభ్యులకు సంతాపం ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
హజ్‌యాత్రలో భాగంగా మక్కా సవిూపంలోని మినా ప్రాంతంలో సైతాన్‌గా పిలిచే మూడు స్తంభాలపై ముస్లింలు రాళ్లు విసురుతారు. యాత్రికులు ఈ కార్యక్రమం అనంతరం మినా నుంచి తిరిగి మక్కాకు వెళ్లడానికి సౌదీ అరేబియా అధికారులు రవాణా సౌకర్యం కల్పించారు. కానీ యాత్రికులు రవాణా సౌకర్యాన్ని నిరాకరించి కాలినడకన బయలుదేరారు. ఇదే ప్రమాదానికి కారణమైంది. కాలినడకన వెళ్తుండగా.. మినాలోని జాదిడ్ సీట్‌లో తొక్కిసలాట చోటుచేసుకుంది. మొదట ఓ బృందం వెళ్తుండగా, మరో బృందం వారిని అనుసరించింది. ఈ నేపథ్యంలో తొక్కిసలాట జరిగింది. మృతులు, క్షతగాత్రుల్లో ఎక్కువ మంది ఆఫ్రికా దేశాలు, ఇరాన్‌కు చెందిన వారు ఉన్నట్లు సమాచారం.
మినాలో సంభవించిన ఘోర ప్రమాద ప్రాంతంలో సౌదీ పౌర రక్షణ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను హుటాహుటిన వివిధ ఆస్పత్రులకు తరలించారు. తొక్కిసలాట ఘటనలో మృతులు, క్షతగాత్రుల వివరాలను తెలుసుకునేందుకు అక్కడి ప్రభుత్వం హెల్ప్‌లైన్ నంబర్లు ఏర్పాటు చేసింది.
తొక్కిసలాటలో హైదరాబాద్ మహిళ మృతి
మినాలో జరిగిన తొక్కిసలాటలో హైదరాబాద్ ఎల్బీనగర్‌కు చెందిన షేక్ బీబీజా మృతి చెందింది. ఈ నెల 2న కుటుంబ సభ్యులతో ఆమె మక్కాకు వెళ్లారు. అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఆమె మృత్యువాతపడ్డారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు ఇక్కడికి సమాచారం అందించారు. దీంతో ఎల్బీనగర్ లోని ఆమె ఇంట్లో విషాం అలముకుంది. గాయపడిన వారిలో ఇద్దరు భారతీయులున్నారని సమాచారం అందింది. మృతుల్లో ఎందరు భారతీయులున్నారా లేదా అనేది ఇంకా తెలియరాలేదు.
ప్రధాని తదితరుల విచారం
ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ప్రస్తుతం మోదీ అమెరికా పర్యటనలో ఉన్నారు. సౌది ఆరేయాలోని మక్కాలో ఇవాళ తొక్కిసలాట జరిగి 717 మందికి పైగా యాత్రికులు మృతిచెందిన ఘటనపై కేంద్ర మంత్రి నజ్మా హెప్తుల్లా స్పందించారు. తొక్కిసలాట చాలా దురదృష్టకరమని తెలిపారు. మక్కాకు లక్షన్నర మందికి పైగా భారతీయులు వెళ్లారని తొక్కిసలాట సంఘటనలో భారతీయులు ఉన్నారో లేదో పూర్తి సమాచారం తెలియడంలేదన్నారు. హజ్ యాత్రకు ఎంత మంది వెళ్లారన్న దానిపై విదేశాంగ శాఖ, హజ్ కమిటీ వద్ద కచ్చితమైన సమాచారం ఉందని తెలిపారు. విభిన్న కోటాల్లో రాష్ట్రాలు యాత్రికులకు సాయం చేస్తూ హజ్ యాత్రకు పంపిస్తున్నందున హజ్ సెల్ పేరిట విదేశాంగ శాఖ ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసి వాటిని పర్యవేక్షిస్తోందని వివరించారు. సౌదీ ప్రభుత్వం అన్ని రకాల సహాయక చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు.
సౌదీ అరేబియాలోని మక్కాలో తొక్కిసలాట జరిగి వందలాది మృతిచెందిన ఘటనపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ, పశ్చిమ్‌బంగ ముఖ్యమంత్రి మమత బెనర్జీ సంతాపం వ్యక్తంచేశారు. మృతులకు నివాళులర్పించారు. మక్కా విషాద ఘటన బాధ కలిగించిందని మమతా బెనర్జీ ట్వీట్ చేశారు. మృతుల కుటుంబసభ్యులకు సంతాపం తెలియజేస్తున్నానని.. ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని అరుణ్‌జైట్లీ ట్వీట్ చేశారు. మక్కా సవిూపంలోని మినా వద్ద తొక్కిసలాట జరిగి నాలుగు వందల మందికి పైగా మృతిచెందారు. 700 మందికి పైగా క్షతగాత్రులైన సంగతి తెలిసిందే. దాదాపు నాలుగు వేల మంది
సౌదీ అరేబియా సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు.