మట్టి విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని కాపాడాలి

-వందేమాతరం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు రవీందర్ రావు
తొర్రూరు 23 ఆగస్టు (జనంసాక్షి )
మట్టి గణపతి విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని కాపాడుకోవాలని
వందేమాతరం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు రవీందర్ రావు అన్నారు.మంగళవారం మండలంలోని అమ్మాపురం గ్రామంలో ఏనుగంటి సత్యనారాయణ,జనార్ధన్ అనే అన్నదమ్ములు సొంత ఖర్చులతో తయారు చేసిన మట్టి వినాయక విగ్రహాలను సందర్శించి,కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా వందేమాతరం ఫౌండేషన్ డైరెక్టర్ రవీందర్ రావు సర్పంచ్ కడెం యాకయ్య,ఎంపీటీసీ డోనుక ఉప్పలయ్యలతో కలిసి మాట్లాడుతూ..నేటి మానవ మనుగడ రసాయనలతో నిండిపోయిందని,చెరువుల్లో,కుంటల్లో గణపతులను నిమజ్జనం చేయడం ద్వారా ప్రజలు ఆ నీటిని వినియోగిస్తే నీటి కాలుష్యం జరిగి అనారోగ్య పాలవుతారని తెలిపారు. గ్రామంలో కుమ్మరులను ప్రోత్సహించి,వచ్చే ఏడాది వరకు ఇప్పటిదాని కంటే పది రెట్లు ఎక్కువగా విగ్రహాలను తయారు చేసి,ప్రజలకు అందుబాటులోకి తేవాలని పిలుపునిచ్చారు.ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను నెలకొల్పి పర్యావరణాన్ని పరిరక్షణకు తోడ్పడాలని,సూచించారు.కులవృత్తిలో భాగంగా అన్నదమ్ములు కష్టపడి మట్టి గణపతులను తయారు చేయడం అభినందనీయమన్నారు.ఈ కార్యక్రమంలో శాట్ అధ్యక్షుడు తీగల కృష్ణారెడ్డి,వార్డు సభ్యుడు జూలూరి జగన్, గ్రామ పెద్దలు తమ్మెర విశ్వేశ్వరరావు,వీరభద్రరావు,తీగల సంజీవరెడ్డి,వెంకట్ రెడ్డి,గూడెల్లి సోమనర్సయ్య,ఐలయ్య,ముద్ధం మహబూబ్ రెడ్డి,కందాడి అశోక్ రెడ్డి,బూరుగు నర్సయ్య, మార్క శ్రీనివాస్,ప్రకాష్,జీకే తండా సర్పంచ్ సోమ్లా నాయక్,కర్కాల సర్పంచ్ సురేఖ సురేందర్,తెలంగాణ కుమ్మర సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మల్యాల రాములు,పాలకుర్తి కన్వీనర్ సముద్రాల సోమయ్య,తొర్రూరు మండల అధ్యక్షుడు కొండాపురం సైదులు, జనరల్ సెక్రెటరీ బొడ్డుపెల్లి సురేష్, కోశాధికారి వెలిశాల సమ్మయ్య,పెద్దవంగర మండల అధ్యక్షుడు పగిడిపాల రమేష్, దంతాలపల్లి మండల అధ్యక్షుడు ఏనుగంటి శ్రీరాములు,అమ్మాపురం కుమ్మర సంఘం సభ్యులు ఏనుగంటి భాస్కర్, శ్రీకాంత్,లక్ష్మణ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.