మట్టి వినాయకులను ప్రతిష్టించి బంగారు వెండి నాణేలను గెలుపొందండి.
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మట్టివినాకులను ప్రతిష్టించి పూజించాలి.
ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి.
తాండూరు అగస్టు 29(జనంసాక్షి) పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు మట్టి వినాయకుల ను ప్రతిష్టించి బంగారు వెండి నాణెములు గెలుపొందాలని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి వెల్లడించారు. సోమవారం తాండూరు పట్టణం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ఇష్టమైన పండుగ వినాయక చవితి అని వెల్లడించారు.రాబోయే తరాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు మట్టి వినాయకుని ప్రతిష్టించి పూజించాలని విజ్ఞప్తి చేశారు. మట్టి వినాయకుల ద్వారా ఎలాంటి ఇబ్బందులు తలెత్తయని గుర్తు చేశారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారుచేసిన వినాయకుని పూజించి నిమజ్జనం చేయడం ద్వారా నీటి కాలుష్యం ఏర్పడి జిల్లా చరాసులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని వినూత్న రీతిలో తాండూర్ నియోజకవర్గ ప్రజలకు మట్టి వినాయకుని ప్రతిష్టిచి వాట్సాప్ నెంబర్ 955 035 4966
కు మెసేజ్ చేయాలని వాటిని క్షుణ్ణంగా పరిశీలించి సెప్టెంబర్ 11న డ్రా తీయడం జరుగుతుందని అందులో గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా 10 గ్రాముల బంగారు నాణ్యం వినాయకుని ప్రతిమతో తయారుచేసి అందజేయడం జరుగుతుంది అని తెలిపారు అదే విధంగా 50 మందికి వెండి నాణెములు అందజేస్తామని తెలిపారు. నియోజకవర్గ ప్రజలు ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుని ప్రతిష్టించి పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు అందించాలని కోరారు.సమస్యలు లేని పట్టణంగా తీర్చి దిద్దుతామన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రాంథాలయ చైర్మన్ రాజు గౌడ్ ,మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ ,పట్టణ అద్యక్షులు నయిం ,వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింహులు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి ,శ్రీనివాస్ చారి ,
తదితరులు ఉన్నారు.