మణుగూరు డిఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన రాఘవేంద్రరావు
పినపాక నియోజకవర్గం సెప్టెంబర్ 05 (జనం సాక్షి): మణుగూరు డివిజనల్ సూపరింటెoడెంట్ (డిఎస్పీ)గా రాఘవేందర్ రావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. మహిళల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదన్నారు. మహిళలపై నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కో రకమైన పరిస్థితులు ఉంటాయి అని తెలిపారు. అన్నిటినీ సమన్వయం చేసుకుంటూ మణుగూరు సబ్ డివిజన్ లో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ గా ఉండేలా చూస్తానని తెలిపారు.