మధమేహంపై అవగాహన ర్యాలీ
హైదరాబాద్: మధుమేహంపై ప్రజల్లో మరింత అవగాహన పెరగాల్సి ఉందంటూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. నెక్లెస్ రోడ్డులో జరిగిన ఈ ర్యాలీ రెండు కిలో మేటర్ల మేర సాగింది. ఐఎంఏ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో ఉచితంగా మధుమేహ పరీక్షలు నిర్వహిస్తున్నామని సంఘం రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎస్ అప్పరావు చెప్పారు. ఈ ర్యాలీలో వివిధ కళాశాలలకు చెందిన నర్సింగ్ విద్యార్ధినులు పాల్గొన్నారు.