మధ్యాహ్న భోజనానికి బ్రేక్ ….
విద్యార్థులకు అవస్థలు
ఆగస్టు 18 జనం సాక్షి :
ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనానికి బ్రేక్ పడింది విద్యార్థులకు అవస్థలు తప్పనితిప్పలు అని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు గురువారం నిరదిక సమ్మె లో మధ్యాహ్న భోజన ఏజెన్సీ వారు మాట్లాడుతూ, పెండింగ్ బిల్లులు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నెలకు మూడు వేల రూపాయలు ఇస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని , ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని అన్నారు. పనిచేయడానికి కడుపునింపని జీతాలు కుటుంబాన్ని ఎలా పోషించేది అని ఏజెన్సీ వారు నిలదీశారు. జీతాలు ఇచ్చేవరకు పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. మద్యహ్న బోజన ఎజెన్సీ వారికి జీవన బృతి చెల్లించే వరకు నిరవదిక సమ్మె కొనసాగిస్తామని అన్నారు.