మన ఊరి మనబడి మన ఊరు మన బస్తి

*mupkal. ఫిబ్రవరి23.(జనం సాక్షి)  ప్రధానోపాధ్యాయులకు అవగాహన కల్పించిన మండల విద్యాధికారి బట్టు రాజేశ్వర్.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అత్యంత ప్రతిష్ఠాత్మక కార్యక్రమం మన ఊరు మన బడి మన ఊరు మన బస్తి అనే కార్యక్రమం పై.. నేడు బాల్కొండ రైతు వేదిక లో ఉమ్మడి బాల్కొండ SMC చైర్మన్లకు ,సభ్యులకు ప్రధానోపాధ్యాయులకు అవగాహన కల్పించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి యొక్క మానస పుత్రిక ఐన” మన ఊరు మనబడి” కార్యక్రమం.. ద్వారా పాఠశాల యొక్క రూపురేఖలు మార్చడంలో ముఖ్యమంత్రి గారి యొక్క కృషి అభినందనీయమన్నారు. ఏళ్ల తరబడి పేరుకుపోయిన మౌలిక సదుపాయాలు కొరతను ఈ కార్యక్రమం ద్వారా మెరుగుపడతాయి అన్నారు. బడుగు బలహీన వర్గాల విద్యార్థులు కార్పొరేట్ స్థాయిలో ఆంగ్ల మాధ్యమం తోపాటు 12 రకాల మౌలిక సదుపాయాలను 2021- 22 ఆర్థిక సంవత్సరంలో ఏర్పాటు చేయనున్నారు. మన ఊరు మన బడి కింద మొదటి విడతలో 35 శాతం పాఠశాలలు, మరో రెండు నెలల్లో 2022-23 ఆర్థిక సంవత్సరంలో మరో 35 శాతం బడులు అనగా 70% పాఠశాలల్లో 12 రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు, విద్యుదీకరణ, టాయిలెట్ రన్నింగ్ వాటర్ సౌకర్యాలు ఏర్పాటు, త్రాగునీటి సౌకర్యం ఏర్పాటు, విద్యార్థిని విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఆఫీస్ వరకు ఫర్నిచర్ ఏర్పాటు, మేజర్ మైనర్ తరగతి గదుల రిపేరు, ప్రహరీ గోడ నిర్మాణం, వంటశాల నిర్మాణం, ప్రతి ఉన్నత పాఠశాలలో డైనింగ్ హాల్ డైనింగ్ హాల్ ఏర్పాటు, ప్రతి పాఠశాలలో డిజిటల్ విద్యను ప్రవేశపెట్టనున్నారూ. ఇందులో భాగంగా బాల్కొండ 08,MENDORA 08,ముప్కాల్ 05 ప్రభుత్వ పాఠశాలలు మొత్తం 21 ఉమ్మడి బాల్కొండ మండలం లోని పాఠశాల లను ఎంపిక చేయడం జరిగింది అని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి బట్టు రాజేశ్వర్ గారు వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మరియు ఎస్ఎంసి చైర్మన్ లు వైస్ చైర్మన్ లు మండల రిసోర్స్ పర్సన్ లు ఉపాధ్యాయులు పాల్గొన్నారు