మన ఊరు మన ప్రభుత్వం మన పథకాలు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన దేవరకొండ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ నాయక్
కొండమల్లేపల్లి డిసెంబర్ 8 జనం సాక్షి న్యూస్ : నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని,తండాలను గ్రామపంచాయతీలుగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ అని
గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత సీఎం కేసీఆర్ తమ తండాలను,తమ గూడలను తామే అభివృద్ధి చేసుకునే అవకాశం కల్పించింది తెలంగాణ ప్రభుత్వం కొండమల్లెపల్లి మండలం దంజిలాల్ తండా రూ.20లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన ఊరు -మన ప్రభుత్వం-మన పథకాలు కార్యక్రమం భాగంగా కొండమల్లెపల్లి మండలం దంజిలాల్ తండాలో పాల్గొన్న దేవరకొండ ఎమ్మెల్యే, నల్గొండ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రవీంద్ర కుమార్
తండాలను గ్రామపంచాయతీలుగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ ది అని దేవరకొండ శాసన సభ్యులు, నల్గొండ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ గుర్తు చేశారు.గురువారం ఊరు -మన ప్రభుత్వం-మన పథకాలు” కార్యక్రమం భాగంగా కొండమల్లెపల్లి మండలం దంజిలాల్ తండాలో రూ.20లక్షల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా తాండలలో ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ కి ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…..గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత సీఎం కేసీఆర్ ది అని ఆయన అన్నారు.తమ తండాలను,తమ గూడలను తామే అభివృద్ధి చేసుకునే అవకాశం కల్పించింది తెలంగాణ ప్రభుత్వం అని ఆయన గుర్తు చేశారు.గ్రామాలు సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుంది అని ఆయన అన్నారు.ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శం అని ఆయన తెలిపారు.నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తా అని ఆయన అన్నారు.ప్రతీ నెల పల్లె ప్రగతి కింద నిధులను మంజూరు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఆయన అన్నారు.సీఎం కేసీఆర్ వచ్చాక ఆసరా పెన్షన్లు,నిరంతర ఉచిత కరెంటు, ఆడపిల్ల పెళ్లికి ఆర్థిక సాయం చేసుకుంటున్నామంటూ.. ఏ పైరవీ చేయకుండానే షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మితోనే ఆడపిల్ల పెళ్లి చేసుకుంటున్నారని ప్రభుత్వ సంక్షేమం అని ఆయన వివరించారు.తెలంగాణలో అన్ని వర్గాలకు మంచి చేయడమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి వర్గాన్ని కడుపులో పెట్టుకొని కాపాడుకుంటున్నది టిఆర్ఎస్ ప్రభుత్వం అని ఆయన తెలిపారు.దేశంలో ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ తెలంగాణలో జరుగుతున్నది అని ఆయన పేర్కొన్నారు.టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా మారాయని అన్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అందజేస్తున్న రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్ పథకాల గురించి గ్రామస్తులకు అవగాహన కల్పించాలని కార్యకర్తలను కోరారు. అంతేగాకుండా, గ్రామాల్లో నిర్మిస్తున్న వైకుంఠ ధామాలు, పల్లె ప్రకృతి వనాలు, సీసీ రోడ్ల నిర్మాణం, చెత్త సేకరణ కోసం ట్రాక్టర్లను ప్రభుత్వం అందజేస్తున్నదని చైతన్యపర్చాలని కోరారు. ప్రతీ గ్రామంలో రైతులను విజ్ఞానవంతులుగా చేసేందుకు రైతు వేదికలను ప్రభుత్వం నిర్మించిందని చెప్పాలని కోరారు. పేదింటి అడబిడ్డల పెండ్లి కోసం కల్యాలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాల ద్వారా ప్రభుత్వం రూ.1,00,116 ఆర్ధిక సాయం అందజేస్తున్నదని అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలను పెంచేందుకు కేసీఆర్ కిట్స్ అందజేస్తున్నదని అన్నారు. ప్రతీ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపర్చి మౌళికవసతుల కల్పనకు పెద్దపీట వేస్తోందని అన్నారు. నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం కల్పించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఆర్ధిక సాయం అందిస్తున్నదని అన్నారు.ఈ కార్యక్రమంలో చింతపల్లి జడ్పీటీసీ కంకణాల ప్రవీణవెంకట్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నెట్వర్ గిరిధర్, కొండమల్లేపల్లి సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కుంభం శ్రీనివాస్ గౌడ్,రైతు బంధు అధ్యక్షులు కేసాని లింగా రెడ్డి,జడ్పీటీసీ సలహాదారుడు పసునూరి యుగేందర్ రెడ్డి,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షలు రమావత్ దసృ నాయక్,స్థానిక సర్పంచ్ రమావత్ లలితబీమ్ సింగ్, మాజీ ఎంపీపీ మేకల శ్రీనివాస్ యాదవ్, ఎంపీటీసీ జగన్ నాయక్,రమావత్ లాలు నాయక్,రాములు నాయక్ రమావత్ తూలిసిరామ్,నేనావత్ భద్రు,అంగోతు పవన్,రమావత్ శ్రీను నాయక్,అధికారులు