మహనీయుల ఆశయలసాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి…..
ఎంపీపీ టేకుల సుశీల ఎస్సై మంగీలాల్
నర్సింహులపేట ఆగస్టు 11 జనం సాక్షి
భారత స్వాతంత్రోద్యమంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి భారత దేశానికి స్వాతంత్ర్యం లభించడానికి ప్రధాన భూమిక పోషించిన మహనీయుల ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎంపిపి సుశీల యాదగిరి రెడ్డి, ఎస్ఐ మంగీలాల్ పిలుపునిచ్చారు. గురువారం స్థానిక మండల కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్రీడమ్ రన్ ను ఎంపీపీ టేకుల సుశీల యాదగిరి రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎస్సై మంగీలాల్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తికావస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.దేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉందని కృషి పట్టుదల అంకితభావం తో పని చేస్తే యువత ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని పిలుపునిచ్చారు. సమాజంలో ఎవ్వరు కూడా కుల మత భేదాలు తావివ్వకుండా అందరూ అన్నదమ్ముల వలె కలిసిమెలిసి ఉండి, జాతీయ సమైక్యతను పెంపొందించి,ప్రపంచ దేశాలన్నీ చూసి అబ్బుర పడే విధంగా భారతదేశాన్ని దిద్దాలని,భారతదేశ త్రివర్ణ పతాకం గర్వంగా తలెత్తుకొని రెపరెపలాడే లాగా ప్రతి ఒక్క పౌరుడు కృషిచేయాలని ఆయన తెలియజేశారు. అనంతరం ఫ్రీడం రన్ అంబేద్కర్ కూడలి నుండి గంగ దేవమ్మ గుడి వరకు జై జవాన్ జై కిసాన్,వందేమాతరం, భారత్ మాతాకీ జై అంటూ యువత చేసిన నినాదాల హోరు తో కొనసాగింది ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వేముల రజిత రామ్ రెడ్డి, జెడ్పిటిసి భూక్యా సంగీత,వైస్ ఎంపీపీ దేవేందర్,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దేవేందర్, రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యులు తోట సురేష్, సర్పంచులు మందుల యాకయ్య,మధు రెడ్డి, ఎంపీటీసీ రవి,వివిధ గ్రామాల ప్రజా ప్రతినిధులు,కాజా మియా,పటేల్ రామన్న, తదితరులు పాల్గొన్నారు.