మహబూబ్‌నగర్‌లో 144 సెక్షన్
మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్‌లో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులపైకి ఆందోళనకారులు రాళ్లు రువ్వటంతో పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. పట్టణంలో 144 సెక్షన్ విధించారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి సహా ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరిస్థితి అదుపులోనే ఉందని ఎస్పీ నాగేంద్రకుమార్ తెలిపారు. నిందితులను వీడియో టేపుల ద్వారా గుర్తించామని, వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. 144 సెక్షన్ అమలులో ఉన్నందున గుంపులుగా తిరగొద్దని పోలీసులు హెచ్చరించారు.