మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయానికి నిప్పు
మహబూబ్‌నగర్: జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి ఈ ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో కార్యాలయంలోని ఫర్నీచర్ దగ్ధమైంది. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.