మహాత్మునికి గవర్నర్, సీఎంల నివాళి
హైదరాబాద్,అక్టోబర్2(జనంసాక్షి):
మహాత్మాగాంధీ 146వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని బాపూ ఘాట్ వద్ద పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. గవర్నర్ నరసింహన్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎంపీ కేశవరావు తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. అనంతరం బాపూఘాట్ వద్ద నిర్వహించిన సర్వమత ప్రార్థనలో ప్రముఖులు పాల్గొన్నారు. అంతకు ముందు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ నేత మల్లు భట్టివిక్రమార్క తదితరులు బాపూఘాట్‌లో నివాళులర్పించారు. తొలుత సిఎం కెసిఆర్ అసెంబ్లీ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహానికి నివాళుఅఉ అర్పించారు. అలాగే శాసనసభ ఆవరణలోని గాంధీ విగ్రహానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, శాసనమండలి చైర్మన్ స్వామి/-నడ్ తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. హైదరాబాద్‌లో పలుచోట్ల బాబూ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన సేవలను కొనియాడారు.