మహానాడుకు తరలిన తెదేపా నేతలు

బాన్సువాడ పట్టణం : హైదరాబాద్‌లోని గండిపేటలో నిర్వహించే మహానాడు కార్యక్రమానికి బాన్సువాడ నుంచి తెదేపా నేతలు తరలివెళ్లారు. తెదేపా నియోజకవర్గ ఇంఛార్జి బద్వానాయక్‌ అధ్వర్యంలో సుమారు 500 మంది వాహనాల్లో హైదరాబాద్‌కు బయలుదేరారు. వచ్చే ఎన్నికల్లో తెదేపా విజయం సాధిస్తుందని ఆయన దీమా వ్యక్తం చేశారు.