మహిళా ఉద్యమ చరిత్ర-ప్రధాన ఘట్టాలు
(గురువారం తరువాయి భాగం)
ఇలాంటి సంఘాలన్నీ మహిళల ప్రత్యేక సమస్యలపై కేంద్రీ కరించాయి. ముఖ్యంగా విద్యార్థుల్లో, ఉద్యోగుల్లో, రైతు కూలీల్లో, కార్మికు ల్లో, కళాకారుల్లో ఈ సంఘాలు ఏర్పడి, ప్రత్యేక స్త్రీ సమస్యలపై ప్రజలను చైతన్యవంతం చేయసాగా యి. ఇందులో సాహిత్యం, కళారూపాలు ఎంతో ప్రాదాన్యతను సంచరించుకు న్నా యి. చిన్న చిన్న వీధి నాటకాల ద్వారా, కరపత్రాల ద్వారా, ఎక్కడి క్కడ చేపట్టిన చేపట్టిన ప్రదర్శనల ద్వారా వీరు విరివిగా పనిచే శారు. మహిళలని చిన్న చూపు చూసేకారు ఈ సంఘాలకి భయప డ సాగారు. కోర్టుల్లొ ఇచ్చే తప్పుడు తీర్పులని సైతం వీరు ధిక్కరిం చారు. అలా దేశవ్యాప్తంగా మహిళల గొతులు ప్రస్ఫుటంగా వినిపిం చాయి. ఒక్కొక్క మహిళ జీవితం ఒక్కొక్క చరిత్రని చెప్తుంది. అందులో తీపి చేదులు రెండూ కలగలిసి ఉంటాయి. చెరుపాళ్లు ఎక్కువ ఉండటం సామాన్య స్త్రీకి అవలవాటే. అలాంటి స్త్రీలంతా తమ గొంతు వినిపించడానికి ఈ సంఘాల్లో తమ సమస్యలని విప్పచెప్పే స్థాయికి ఎదిగారు. పది మంది ముందు నోరు విప్పడా నికి జంకిన మహిళలు సైతం ఈ ప్రత్యేక సంఘాలు ఇచ్చిన ప్రాత్సా హంతో భావవ్యక్తీకరణ నేర్యుకుని, నేడు అనర్గలంగా మాట్లాడి స్త్రీలకి నాయకత్వం వహించే స్థాయికి ఎదిగారు. ఫ్యూడల్ భావాలను తిప్పికొడుతూ ప్రజాస్వామిక భావాలను చాటి చెప్తూ, స్త్రీవాద సాహిత్యం పెంపొందింది.
ఫెమినిజం : దాదాపు ఆదే సమయంలో పట్టణాల్లో ఫెమినిజం ఎజెండా మీదకు వచ్చింది. పత్రికలు దాన్ని ప్రచారం చేశాయి. వ్యక్తిత్వాన్ని రాజకీయంగా సమర్ధిస్తూ, శారీరక తేడాల వల్ల స్త్రీలుగా అణగారిపోవడాన్ని నిరసిస్తూ, పితృస్వామ్య భావజాలాన్ని ఖండి స్తూ, సాహిత్యంలో ఈ ధోరణి ఒక పెద్ద అలలా ఉవ్వెత్తున లేచిం ది. అయితే ఉత్పత్తి, పునరుత్పత్తి మధ్య వైరుధ్యాన్ని సృష్టిస్తూ, స్త్రీల అణిచివేత పునాదులను అర్ధం చేసుకోవడంలో విఫలమయ్యారు. అలా అది మహిళోద్యమంలో ఒక ధోరణిగానే మిగిలిపోయింది. స్త్రీలు ఉత్పత్తిలో పాలు పంచుకుంటూ తమనుతామువిముక్తం చేసుకుంటూ అణగారిన వర్గాలతో చేతులు కలుపవలసిన ఆవశ్య తను వారు గుర్తించవలసి ఉంది.
దళిత పోరాటాలకు మద్ధతుగా :
అగ్రకులాల ఆగడాలకు తారస్థాయిగా కారంచేడు, పదిరికుప్పం, నీరుకొండ, చుండూరు, దాడులు జరిగాయి. కారంచేడులో తన కొడుకును నరికిన దొపిడీ దారులను గుర్తించి ప్రధాన సాక్షిగా నిలిచిన అలీసమ్మని అగ్రకులాలు హత్య చేశాయి. చుండూరులో కూడా ప్రధాన సాక్షిని పోలీసులు చంపేశారు. ఈ దారుణకాండకు వ్యతిరేకంగా రాష్ట్రమంతా అట్టుడికిపోయింది. మహిళలు అనేక రూపాల్లో నిరసనను తెలియజేశారు. సావిత్రిబాయి పులే వంటి వారు రగల్చిన చైతన్యం వారిలో వెల్లివిరిసింది.అప్పటికే ‘దున్నే వారిదే భూమి’ అనే నినాదం పేరుతో సాగుతున్న రైతాంగ పోరాటా ల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. కుల, మత, వర్గ, లింగ వివక్షలను ఎదిరిస్తున్నారు. పై సంఘటన తర్వాత దళిత మహిళలు మరింత పటిష్టంగా భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం పోరాడారు. కుల వివక్షని, లింగ వివక్షని ఎదిరిస్తూ అన్ని రకాల అత్యాచారాలను ఎదిరించాలి. ఈనాడు లక్షింపేట మళ్లీ ఎంతో చర్చను లేవనెత్తింది. అది కుల సమస్య అని కొందరు భూమి సమస్య అని కొందరు వాదిస్తే, బొజ్జ తారకం వంటి వారు దాన్ని భూమి కలిగిన దళితుల సమస్యగా వర్ణించారు. అంటే మన దేశంలో కుల సమస్య ప్రధానంగా వర్గ సమస్యే అని పదే పదే రుజువవుతూనే ఉంది.
సారా వ్యతిరేక పోరాటం:
ఈ పురుషస్వామ్య సమాజంలో స్త్రీల అణచివేతలో సారాకి పెద్ద పాత్రే ఉంది. కుటుంబానికి కుటుంబాలు ఆర్థికంగా చితికిపోవడా నికి ఇది ఒక కారణం. ఇల్లు గడవడం కోసం నగలె రేయీ రెక్కలు ముక్కలు చేసుకునే స్త్రీలు, తమ భర్తలు తమకి చేయూతనివ్వకపోగా ఇద్దరి సంపాదనా తాగి తగలేస్తుంటే చూస్తూ ఊరుకోలేదు. ప్రభుత్వ ఖజానా నింపడం కోసం వారుణివాహిని పేరుతో సారా ఒక సాధనమయింది. దాన్ని వ్యతిరేకిస్తూ సారా ఉద్యమంలో లక్షలాది మహిళలు ప్రభంజనంలా కదిలారు. ‘సారా కాదు- నీరు అందించండి’. ‘ సారా ప్యాకెట్ కాదు-పాల ప్యాకెట్స్ అందించం డి’. ‘పానశాల కాదు- పాఠశాలలు కావాలి’. వంటి నినాదాలతో స్త్రీలు వీథుల్లో కదం తొక్కారు. మంచినీటి సరఫరా కోసం ఎలాంటి ప్రయాత్నాలు చేయన ప్రభుత్వం సారాని మాత్రం రాష్ట్రం మూలమూలలకి పంపడాన్ని వీళ్లు వ్యతిరేకించారు. ప్రదర్శనలు, రాస్తారోకోలు, ధర్నాలు, బహిరంగ సభలు నిర్వహించి, సారా షాపులపై దాడి చేశారు. ప్రభుత్వానికి, సారా కాంట్రాక్టర్లకి మధ్య జరిగిన ఒప్పందాలు ప్రజా వ్యతిరేకమైనవని వారు గ్రహించారు. ఈ పోరాటం వల్ల తమ లాభార్జనకు గండిపడడంతో కాంట్రాక్టర్లు, ప్రభుత్వం కలిసి ప్రజలపై విరుచుకు పడ్డారు. ఉద్యమకారులపై దాడులు చేయించారు. నెల్లూరు జిల్లాలో ఆరంభమైన ఈ పోరాటం అలలు అలలుగా విస్తరించి, పల్లెలనే కాక పట్టణాలను చుట్టుము ట్టింది. తెలంగాణలో మరింత ఊపందుకుంది. రోజువా రీ సమస్య లపై మహిళలు దావానలంలా ఎల కదిలిరాగలరో 1992లో జరిగిన ఈ ఉద్యమం రుజువు చేసింది. దూబగుంట రోశమ్మ లాంటి వారు చరిత్రను లిఖించారు. ప్రభుత్వ ఎక్సైజ్ విధానానికి ఇలాంటి వ్యతిరేకత రావడంతో ఎన్‌టిఆర్ ప్రభుత్వం మద్యపాన నిషేదాన్ని విధించింది. కానీ చంద్రబాబు నాయుడు దాన్ని ఎత్తివేసి, మళ్లీ గ్రామాలను సారాతో ముంచెత్తాడు. సారా పోరాటంలో భాగంగా జరిగిన ‘అక్షరజ్యోతి’ అనే నిరక్షరాస్యతా నిర్మూలన కార్యక్రమానికి కూడా చంద్రబాబు వల్ల గండిపడింది.
జాతుల పోరాటానికి మద్దతుగా :
80వ దశకంలో జాతుల న్యాయమైన పోరాటాలను అణచివేయడం కోసం బడా బూర్జువా వర్గాల ప్రభుత్వం ప్రజలను తీవ్రమైన ఇబ్బందులకు గురిచేసింది. జాతుల అభ్యున్నతికోసం వారు న్యాయంగా పోరాటం చేస్తుంటే వారి సమస్యను తీర్యకపోగా అందమైన భారతదేశం పటం ఛిన్నాభిన్నమవడం సహించేది లేదంటూ వారిపై విరుచుకుపడింది. అలాంటి చర్యలను కండిస్తూ ఈశాన్య భారతంలో, కాశ్మీర్‌లో మహిళలు ముందుకొచ్చారు. ఉద్యమకారులని నైతికంగాబ లహినపరచడం కోసం ప్రభుత్వం మహిలళపై దాడి చేసింది. యువకులను మాయం చేసింది. స్వయం నిర్ణయాధికారం కోసం పోరాడే వారిని ప్రభుత్వం మానభంగాలు జరిపి అణచాలని చూస్తే ‘హమ్ చుప్ నహీ బైఠేంగే’ అంటూ కాశ్మీర్ మహిళలు కూడా తుపాకులు పట్టి, కత్తులతో, బూమరాంగ్‌లతో శిక్షణ పొందారు. అలాంటి మన రాష్ట్రంతో సహా అనేక చోట్ల మహిళలు స్పందిం చారు. ప్రస్తుతం తెలంగాణ కోసం జరుగుతున్న ఉద్యమంలొ కూడా విద్యార్ధినులు, మహళలు ఎంతో చొరవ చూపుతున్నారు.
భోపాల్ విషవాయువుకి వ్యతిరేకంగా:
1984 డిసెంబర్‌లో భోపాల్‌లో యూనియన్ కార్బయిడ్ విషవాయువు దుర్ఘటనలో దాదాపు సగం జనాభాకి విష వాయువు సోకింది. ఫ్యాక్టరీ చూట్టూ ఉంది నిరుపేదలే, ప్రాణాలు కోల్పోయిం దీ ఈ బడుగు జీవులే. బహుళజాతి సంస్థల అతిదారుణమైన ప్రజావ్యతిరేక చర్యగా ఇది చరిత్రలో నిలిచిపోయింది. నష్టపరిహారం చెల్లింపు చాలా ఆలస్యంగా, అతి స్వల్పంగా ఉంటే ఆ వాయువు కలిగించిన దుష్ప్రభావాలు ఇప్పటికీ వారిని వేధిస్తున్నాయి. మిథైల్ ఐసోసైనేట్ రోజూ ఏదో ఒక రూపంలో విలయతాండవం చేస్తుంది. నీరసం, గన్బస్రావాలు, వికలాంగ సంతానం, మరణవేదన మిగిలాయి. తరతరాలుగా వేధిస్తున్న ఆ దుర్ఘటన వారికి దినదిన గండంగా తయారయింది. కార్బయిడ్‌పై క్రిమినల్ కేసు ఉపసంహరించి, 4500కోట్ల రూపాయల పరిహారం బదులు 715 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లిస్తే సరిపోతుందనే కోర్టు తీర్పు ప్రజల బాదల్ని పెంచింది. పైగా, తలా మూడు వేల పరిహారంతోనే అక్కడి పేదల మధ్యతరగతి గా మారిపోతారంటూ ఒక జడ్జి చేసిన ఉవాచ పుండు మీద కారం చల్లింది. మిక్ విషవాయువు వల్ల రెండున్నర వేల మంది చనిపోగా, ఐదు లక్షల మందికి ఈ వాయువు సోకింది. దాదాపు 80 వేల మంది జీవితాంతం అంగవైకల్యంతో, వ్యాధులతో బాధపడవలసిందే అని భారత వైద్య పరిశోధనా మండలి నిర్థారించింది. ప్రజలు ప్రతిఘటించారు. ఫ్యాక్టరీని చుట్టుముట్టారు. సంఘాలుగా ఏర్పడి ధర్నాలు, రైల్ రోకోలు, ట్రాఫిక్ బంద్‌లు చేపట్టారు. భోపాల్ గ్యాస్ పీడిత మహిళా ఉద్యోగ సంఘటన్‌గా మహిళలు కూడా సంఘటిత పడ్డారు. వీరికి మద్దతుగా దేశమంతటా ప్రదర్శనలు జరిగాయిజ. కోర్టు తీర్పు ప్రజావ్యతిరేకంగా ఉందంటూ మహిళలు అసెంబ్లీ ముందు, సుప్రీం కోర్టు ముందు ప్రదర్శనలిచ్చారు. వారికి న్యాయం జరగలేదు సరికదా లాఠీ దెబ్బలు మిగిలాయి. హిందుస్తాన్ గులామ్ కార్బయిడ్ సలామ్ ‘ హమారే ఔలద్ భీ లడేగీ హమారే మౌత్‌కే బాద్’ ‘కైరాత్ నహీ రోజ్‌గార్ చాహియే’, ‘ గైర్ కానూనీ ఫైసలా వాపస్‌లో’ వంటి నినాదాలతో ఆ ప్రాంతాలన్నీ హోరెత్తిపోయాయి. మహిళల సంఘటిత శక్తికి ఇది ఒక నిదర్శనం. ఈ సందర్బంగా మన రాష్ట్రంలో అనేక సభలు, ప్రదర్శనలు జరిగాయి. భోపాల్ మహిళలకు సంఘీభావంగా విద్యార్థినులు బాగా కదిలారు. ప్రతి విద్యా సంస్థలో మీటింగ్‌లు పెట్టి, సమస్య తీవ్రతని తెలియజెప్పి, భోపాల్ బాధితుకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ, సంతకాలు సేకరించి సుప్రీంకోర్టుకి పంపారు. పర్యావరణాన్ని పెద్ద ఎత్తున దెబ్బతీసిన ఈ సంఘటన లాంటివి ఇంకా పదేపదే కొనసాగునూనే ఉన్నాయి. ప్రతిఘటనా తప్పడం లేదు.
మండల్ కమిషన్ వ్యతిరేక పోరాటాన్ని నిరసిస్తూ
పెరుగుతున్న ఆర్థిక సంక్షోభానికి కారణాలు వెతికే ప్రయత్నం చేయకుండ నిరుద్యోగానికి అసలు కారణాలు వెతకుండ కొందరు ఉన్నత కులాల విద్యార్థులు రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళన చేపట్టారు.ఎదురుగా కన్పిస్తున్న నిరుపైద దళితులపై నేపాన్ని నెట్టి ,తమ అవకాశాలు వాళ్లు కాజేస్తున్నారనే అపోహతో వాళ్లు ప్రజా వ్యతిరేక చర్యలు చేపట్టారు.ఈ అభివృద్ధినిరోదక శక్తులను ఖండిస్తు ,రిజర్వేషన్ కొనసాగించాలని డిమాండ్ చేస్త వామపక్షాల విద్యార్థి సంఘాలు ఉద్యమించాయి.ఇందులో విద్యార్థునులు చురుగ్గా పాల్గొన్నారు.తరతరాలుగా అణగారిపోయిన వర్గాలకు రిజర్వేషన్ ల చేయుతతో కొంతైనా ఆసర కల్పించాల్సిన అవసరాన్ని వారు నొక్కి చెప్పారు.ప్రాథమిక విద్యలో సెకండరీ విద్యలో కింద కులాలవారు రిజర్వేషన్లు కొంతవరకే వాడుకున్న ఉన్నత విద్యలో వారి సీట్లు కాలీగా ఉండాడానికి వెనుకగల ఆర్థిక రాజకీయ కారణాలను విశ్లేశిస్తు అనేక ప్రచార ఆందోళన కార్యక్రమాలు జరిగాయి.అన్యాయానికి గురైన వారికే అన్యాయం చేసే వారిగా చిత్రించే ఉన్నత వర్గాల కుట్రను ఈ ఉద్యమం బయటపెట్టింది.
బాబ్రీ మసీదు కూల్చివేతకు నిరసన
మత దురహంకారుల దౌర్జన్యానికి పరాకాష్ట బాబ్రీ మసీద్ కూల్చివేత ముస్లింలు మొదటి సారిగా తమ అస్తిత్వాన్ని నిలబెట్టుకొక తప్పని సరి పరిస్థితులు ఏర్పడ్డాయి.కలిసి మెలిసి పని చేసిన చోట సైతం తమ పేరు చెప్పుకోవడానికి జంకే బయపడే సందర్బం ఏర్పడడం విచారకరం.దేశవిభజన కాలంనాటి కాళరాత్రి మళ్లీ తాండవించింతి.మత కల్లోళాలను ప్రేరేపించే ఇలాంటి దురాగతాలను ఖండిస్తు కదిలిన ప్రజాస్వామిక వాదుల్లో మహిళలు కూడా ముందు పీటాన నిలిచారు.ఎన్నో రచనలు కూడా చేశారు.ఏకత్వమే బిన్నత్వమనే నాయకుల నినాధాలు బోలు తనాన్ని బయటపెడుతూ గాయపడిన హృదయాలతో ప్రజాస్వామిక వాదులు ముస్లింలకు చేదోడుగా నిలిచారు.మరోవైపు తస్లీమా నస్రీన్ వంటి మానవతావాదుల పై జరగిన దాడులను నిరసించారు.
5.నూతన ఆర్థిక విదానాలకు వ్యతిరేకంగా విస్తరించిన పోరాటాలు
సంఘటితమవుతున్న మహిళల పోరాట పటిమను నీరుగార్చే దిశగా ప్రభుత్వ పొదుపు లక్ష్మి వంటి ఫథకాలు పెట్టి డ్వాక్రా వంటి స్వయం ప్రతిపత్తి గల సెల్ఫ్ హెల్ప్‌లను స్థాపించింది.
డా. నళిని
– వీక్షణం సౌజన్యంతో
తరువాయి భాగం రేపటి సంచికలో….