మహిళా ఉద్యమ చరిత్ర-ప్రధాన ఘట్టాలు
(ఆదివారం తరువాయి భాగం)
ఈ అవగాహన ప్త్రీలకే కాక పరుషులకి లేకపోతే, అంతిమ పోరాటంలో స్త్రీలు వెనకబడి పోతారు. విముక్తి పోరాటానికి అది ప్రతిబంధకమే అవుతుంది. సూక్ష్మంగా చూస్తే ఒక కుటుంబంలో పరుషుడు బయట ఎంత మహత్తరమైన పోరాటాల్లో పాల్గొన్నా, ఇంట్లో భార్యకి దాని విలువ తెలిసి ఆమె కూడా అందుకు సంసిద్దం కాకపోతే, ఆమె అతనికి ప్రతిబంధకంగా తమారవుతుంది. అప్పుడా మె బానిసకొక బానిసగా పడి ఉంటుంది. అందుకే, ‘బానిస యుజ మాని’ మనస్తత్వాన్ని అందరిలో దూరం చేయాలిన ప్రబొదించాడు లెనిన్.
నూతన ఆర్ధిక విధానం (ఎన్‌ఇపి) పేరుతో ఈనాడు మన దేశం సామ్రాజ్యవాద దోపిడీకి అధికాధికంగా గురవుతుంది. దాని ముద్దు పేరే ‘ప్రపంచీకరణ’. పీడిత ప్రజలని ఏకం చేసే ప్రపంచ దేశాలను సమైక్యం చేసే అంతర్జాతీయ తత్వానికి దీనికి చాలా తేడా ఉంది. ఎన్‌ఇపి కింద ఆహారదాన్యాల ఆత్పత్తి పడిపోయింది. ధరలు పెరిగాయి. కుటుంబాన్ని నడిపే స్త్రీ అతలాకుతలమవుతోంది. ఆహార లోపంతో వ్యాధులు పెరుగుతున్నాయి. దోగ నిరోధక శక్తి తగ్గుతుంది. మంచినీళ్ల రువు. పక్కా ఇళ్లు లేవు. పాయఖానాలు లేవు. అటవీ సంపద దోపిడీతో కూడా స్త్రీలు ప్రభావిత మవుతున్నారు. ఇంధనం కరువుకి కూడా స్త్రీలే బలవుతున్నారు. పెరుగుతున్న విద్యుత్ ఛార్జీలు, తగ్గుతున్న గ్యాస్ పంపిణీ, పెరుగుతున్న ధరలు, తరుగుతున్న ఉద్యోగవకాశాలు స్త్రీలని వేధిస్తున్నాయి. అన్ని చోట్ల స్వచ్చంద పరవీ విరమణని ప్రోత్స హించి, కాంట్రాక్ట్ ఉద్యోగాల పేరుతో మరో విధంగా దోచుకుం టున్నారు. అక్షరాస్యతలో వెనకబడి స్త్రీలు మెరుగైన ఉద్యోగాలు పొందలేక పోతున్నారు. అత్యంత దయనీయ స్థితిలో వ్యభిచారం లోకి నెట్టబడి ఎయిడ్స్‌కి కూడా బలవుతున్నారు. అందుకే, 20వ శతాబ్దంలో మూడవ క్రపపంచ దేశాల్లో చెలరేగిన మహిళోద్యద మాల్లో సామ్రాజ్యవాద వ్యతిరేక అంశం ప్రత్యేకమైన రాజీలేని డిమాండ్‌గా మిగిలిందంటారు. ఇందు అగ్నిహోత్రి, స్త్రీల సమానత్వం రాజకీయమైనది కావడంతో మార్పు కోసం సంఘటితమైన ఉద్యమాలను బలోపేతం చేయవలసిన అవసరం ఉందని ఆమె నొక్కి చెప్పింది. స్త్రీలందరూ ఏదో ఒక రూపంలో వివక్షకి గరవుతూనే ఉన్నాగానీ, వారిలో కూడా వర్గాన్ని బట్టి పీడన రూపాలు మారుతాయి. అందుకే ప్రదానంగా మహిళలు సమస్యలు ఒకటే అనిపించినా, వాటిలో ప్రత్యేకతలు ఉంటాయి. ప్రాధాన్యతలుంటాయి. ఇంటి చాకిరీ, పిల్లల పెంపకం అందరికీ ప్రతిబంధకాలే. రాజ్యం వాటికి హామి కలిగిస్తే, స్త్రీలు ఉత్పత్తిలో ఎక్కువగా పాల్గొనగలుగుతారు. అలా వారు తమను తాము తెలుసుకుంటూ బంధనాలు తెంచుకోగలుగుతారు. సమాజంలో మార్పు కోసం ఏ ఉద్యమం జరిగినా, అందులో మహిళల భాగస్వామ్యం లేకపోతే అది అసంపూర్తిగానే మిగిలిపోతుంది. అయితే, వారి ప్రత్యేక సమస్యల కోసం ప్రత్యేక ప్రత్యేక సంఘాలు అవసరం. ప్రత్యేక గళాలు అవసరం. సామాజిక, ఆర్దిక పునాది లేని మహిళోద్యమం వర్గ దృక్పధాన్ని కోల్పోతే దీర్ఘకాలిక లక్ష్యాలు నీరుగారిపోయి, అది కొంతమందిపై వర్గాల స్త్రీల చేతుల్లో చిక్కుకుపోయే ప్రమాదం వుంది. అందుకే, ఆయా వర్గాల పీడిత మహిళలకు ప్రత్యేక సంఘాలు అవసరం. ప్రత్యేక డిమాండ్స్ లేవనెత్తాలి. అప్పుడు ఏ డిమాండ్లకి ప్రాధాన్యతనివ్వాలి, ఏ మహిళ పైయ మనం ప్రదానంగా కేంద్రీకరించాలి, ఎలాంటి నిర్మాణాలు చేపట్టాలి, ఎవరెవరితో చేతులు కలపాలి, ఎవరి మీదకి పోరాటాన్ని ఎక్కుపెట్టాలనే విషయాల మీద స్పష్టత ఏర్పడుతుంది. సమాన అవకాశాలు కల్పించని వ్యవస్థని ప్రశ్నిస్తూ, దోపిడీ పీడనలని వ్యతిరేకిస్తూ, ఉత్పత్తిలో, సమాజాభివృద్దిలో భాగాస్వామ్యాన్ని కోరుతూ, త్యాగాలకి వెరవకుండా, ఒకవైపు పురుషస్వామ్యాన్ని ఎదిరిస్తూ, మరోవైపు దోపిడీపై కొరడాఝలిపిస్తూ నేటి స్త్రీ చైతన్యంతో పోటెత్తుతూ ఆదర్శంగా నిలు స్తోంది. దోపిడీ కారణాలను వెతుకు తూ, వివక్ష మాలాలను అన్వేషిస్తూ, ప్రశ్నలను సంధిస్తూ, ఛేదిస్తూ, అడుగడుగునా ముళ్ల బాటలను అధిగమిస్తూ తన స్ధానాన్ని సుస ి్ధరం చేసుకుంటోంది. జీవించే హక్కు కోసం, పరిపూర్ణమైన మనిషిగా జీవించే హక్కు కోసం తపన పడుతోంది. అందుకే ఆమె బాటకి అడ్డంగా ప్రతిబంధకాలు ఏర్పర్చకం డి. ఆత్మస్థైర్యాన్ని పెంచుకుంటున్న మహి ళలు ఇంకా ఎన్నో అడ్డంకులు దాటవలసి ఉంది. బానిస సంకెళ్లను సమూలంగా తెంచవలసి ఉంది.
మన దేశంలో మహిళోద్యమాన్ని కూలంక శంగా పరిశీలిస్తే కొన్ని విషయాలు విశదమవుతాయి.
-స్త్రీలకు ప్రత్యేక సమస్యలున్నాయి. కాబట్టి ప్రత్యేక నిర్మాణాలు, ఆందోళనా పద్దతులు అవసరం. కార్మికవర్గ నాయకత్వం కింద పెద్ద ఎత్తున స్త్రీల సమీకరణం జరిగాలి.
-మహిళా ఉద్యమం దానికదే ప్రజా ఉద్యమంగా పెంపొంది, సాధారణ ప్రజా ఉద్యమంలో భాగం కావాలి.
-విప్లవోద్యమం వేసిన ప్రతి అడుగు మహిళోద్యమమాన్ని మరొ అడుగు ముందుకు తీసుకుపోతుంది.
-స్త్రీలు లేకుండా నిజమైన ప్రజా ఉద్యమాలు ఉండలేవు. స్త్రీలు సామాజిక విప్లవ చైతన్యాన్ని పెంచాలి.
-స్త్రీల స్థితిని మెరుగుపర్చడానికి స్త్రీల తక్షణ సమస్యలను, తక్షణ డిమాండ్లను ముందుకు తీసుకురావాలి.
-పట్టణాల్లో విద్యార్ధులు, ప్రభుత్వోద్యోగులు, కార్మికులు మొదలైన వివిధ సెక్షన్లకు చెందిన మహిళలు సంఘటితం కావడంతో మహిళా సమస్యలు ముందుకొచ్చాయి. మహిళోద్యమం బలంగా పెంపొందింది.
-శ్రామిక మహిళలు విముక్తి కానిదే స్త్రీ విముక్తికి అర్థం లేదు.
మహిళల స్థితిగతులను అంచనా వేసే కమిటీని ప్రభుత్వం 1971ఓ ఏర్పరిచింది. ఆ కమిటీ 1975లో తన నివేదికను సమర్పించింది. ‘సమానత్వం దిశగా’ అనే ఈ నివేదిక ఎంతో కీలకమైన ప్రశ్నన,ఇ లేవనెత్తింది – ఈ అసమానతలని కేవలం స్త్రీలలోనే తొలగించలేం. స్త్రీల విముక్తికోసం , అభివృద్ది కోసం జరిగే ఏ ఉద్యమమైనా, అమలయ్యే ఏ విధానమైనా, తప్పనిసరిగా అన్ని అసమానతలను రూపు మాపాలి. అణచివేతకి దారితీసే అన్ని సామాజిక సంస్థలని రద్దు చేసే ఉద్యమంలో అవి భాగం కావాలి. అప్పుడు మాత్రమే, ఆ చర్యల వల్ల కలిగిన లాభాలు, అవకాశాలు, విజయాలు యావత్ మహిళా లోకానికి చేరతాయి. అవి కొద్ది మంది చేతుల్లో బందీ కాకుండా పోతాయి. అంటే మహిళలు ప్రత్యేక సమస్యలున్నాగానీ, సమాజంలో ఒక భాగంగా వారు అన్నీ సమస్యలపై స్పందించాలి. అందుకే, మహిళలు తమ ప్రత్యేక సమస్యలపై పోరాడుతూనే, పురుషులతో భుజం భుజం కలిపి సామాజిక, ఆర్థిక, రాజకీయ దురన్యాయాలన్నిటినీ దునుమాడ వలసి ఉంది. ఆకాశంలో సగంగా ఉన్న మహిళలు తాము కోల్పోయిన జీవన స్థాయిని నిలబెట్టి ప్రపంచానికే ఆదర్శప్రాయంగా పోరాడవలసి ఉంది. ఈ బృహత్తర కార్యక్రమంలో విస్తృత స్థాయిలో సమీకరణ జరిపి అభివృద్దికర శక్తులన్నిటినీ ఏకం చేయవలసిన మహత్తర కర్తవ్యం మన ముందుంది.
– డాక్టర్ నళిని
వీక్షణం సౌజన్యంతో …