మాంటిసోరి శ్రీ సత్య భాస్కర పాఠశాల్లో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు

పినపాక నియోజకవర్గం ఆగష్టు 19 (జనం సాక్షి): మణుగూరు మండలంలోని మాంటిస్సోరి శ్రీ సత్య భాస్కర ఉన్నత పాఠశాల్లో కృష్ణాష్టమి వేడుకలను సాంప్రదాయ పద్ధతిలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.కృష్ణాష్టమి సందర్భంగా పాఠశాల్లో ని ఎల్ కేజీ, యూకేజీ విద్యార్థిని విద్యార్థులచే శ్రీకృష్ణుడు, రాధాగోపికల వేషధారణలో చిన్నారులను ఎంతో అందంగా తయారై చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఐసక్ థామస్ మాట్లాడుతూ శ్రీ మహా విష్ణు ఎనిమిదవ అవతారమే శ్రీకృష్ణ జన్మదినమే గోకులాస్తాని కృష్ణాష్టమి అని పిలుస్తారు. శ్రావణమాసంలో లభించే పళ్ళు అటుకులు బెల్లం తో కలిపిన వెన్న, పెరుగు, మీగడ తో నైవేద్యం పెడతారు. దుష్టశిక్షణ శిష్ట రక్షణ అన్న గీతోపదేశంతో మానవాళికి దిశా నిర్దేశం చేశారని జన్మాష్టమి యొక్క గొప్పతనాన్ని విద్యార్థులకు వివరించారు. ఆ తర్వాత పాఠశాల విద్యార్థులచే ఉట్టి కొట్టే కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థిని విద్యార్థులు అందరూ కలిసి బుడి బుడి అడుగులతో చేతులను అటు ఇటుగా కదుపుతూ చక్కటి నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. పాఠశాల కరస్పాండెంట్ జోస్ నెడుం తుండమ్, పాఠశాల డైరెక్టర్ ముల్లంగి శివారెడ్డి విద్యార్థిని విద్యార్థులకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు.. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ముల్లంగి శివారెడ్డి , ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు, తల్లితండ్రులు తదితరులు పాల్గొన్నారు.