మాంటిసోరి శ్రీ సత్య భాస్కర పాఠశాల్లో వజ్రోత్సవ ముగింపు వేడుకలు
పినపాక నియోజకవర్గం ఆగష్టు 22 (జనం సాక్షి): 75 వసంతాల స్వాతంత్ర వజోత్సవాల వేడుకలో భాగంగా మణుగూరు మండలంలోని మాంటిస్సోరి శ్రీ సత్య భాస్కర పాఠశాలలో ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించారు. వజ్రోత్సవాలలో భాగంగా పిల్లలకు నిర్వహించిన అబాకస్, వ్యాసరచన, వకృత్వ, కబడ్డీ, కో- కో, స్కిప్పింగ్, పాటల పోటీలలో గెలుపొందిన విద్యార్థినీ విద్యార్థులకు మణుగూరు పాఠశాల అధ్యక్షులు ముల్లంగి శివారెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఐసక్ థామస్ లు బహుమతులు ప్రధానం చేశారు. పాఠశాల అధ్యక్షులు ముల్లంగి శివారెడ్డి మాట్లాడుతూ పిల్లలు చదువుతోపాటు, ఆట పాటల యందు రాణించాలని, అవి వారి సర్వతో ముఖాభివృద్ధికి తోడ్పడుతాయని, వారిలో మనోధైర్యాన్ని నింపుతాయని తెలిపారు. ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ పిల్లలందరూ క్రమశిక్షణతో కూడిన చదువుతోపాటు, ఆటపాటల యందు శ్రద్ధ చూపించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు, బోధనేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.