మామను హత్య చేసిన కోడలు
భూతగాదాలే కారణమన్న పోలీసులు
కరీంనగర్,మే22(జనం సాక్షి ): సైదాపూర్ మండలంలోని బొమ్మకల్ గ్రామంలో మంగళవారం తెల్లవారు జామున జనవేణి నర్సయ్య(75) అనే వృద్ధుడు హత్యకు గురయ్యాడు. ఆయన కోడలు స్వరూప, మనుమడు శివ, మనుమరాలు శివానిలు కలిసి ఈ హత్య చేశారు. సైదాపూర్ ఎస్సై శ్రీధర్ అందించిన వివరాల మేరకు నర్సయ్య పేరువిూద రెండెకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆ భూమిని మనుమడు శివ పేరున రిజిస్టేష్రన్ చేయించాలని కోడలు స్వరూప ఒత్తిడి తీసుకొచ్చింది. ఈ క్రమంలో రెండు నెలల నుంచి భూతగాదాలు నడుస్తున్నాయి. భర్త వెంకటస్వామి ఇంట్లో లేని సమయంలో స్వరూప ఈ ఘాతుకానికి పాల్పడింది. తొలుత గొంతు నులిమి చంపి చున్నీతో ఫ్యాన్‌కు వేలాడదీసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు విఫలయత్నం చేసింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తులో భాగంగా అనుమానంతో స్వరూపను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించింది.
—