మార్పు కోరుకోండి అభివృద్ధి చేసుకోండి

త్రిపురా ఎన్నికల పర్యటనలో రాహుల్‌
అగర్తలా, (జనంసాక్షి) :
కేరళ, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లోగా త్రిపుర ప్రజలు వామపక్ష కూటమి పాలనకు చరమగీతం పాడి మార్పును కోరుకోవాలని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఓటర్లకు పిలుపునిచ్చారు. సోమవారం అగర్తలాలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. త్రిపురలో వామపక్ష పాలకులు అన్ని రంగాల్లో విఫలమయ్యాయని, వారి పాలనంతా వైఫల్యాలమయమని పేర్కొన్నారు. సోనమూర, సనిత్‌ బజార్‌, ఉత్తర, దక్షిణ త్రిపుర, ధర్మనగర్‌, ఖయేర్‌పూర్‌లో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలలో రాహుల్‌ హిందీలె ప్రసంగి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. యూపీఏ ప్రభుత్వం పేదల అభ్యున్నతికి, అభివృద్ధికి కట్టుబడి ఉందని తెలిపారు. కేరళ, బెంగాల్‌   ప్రజలు కమ్యూనిస్టు పాలనతో విసిగిపోయి మార్పు వైపునకు మొగ్గు చూపారని, ఇప్పుడు మీ వంతు వచ్చిందని అక్కడి ఓటర్లను ఉద్దేశించి అన్నారు. ప్రధాని మన్మోహన్‌సింగ్‌, ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ నేతృత్వంలో ప్రజాసంక్షేమ పాలనను అందిస్తున్నామని తెలిపారు. ఆయన వెంట అరుణాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి నబామ్‌ టకి వేవ్‌, త్రిపుర కాంగ్రెస్‌ నేతలు, పార్టీ అభ్యర్థులు తదితరులు ఉన్నారు.