మా నాయకుల జోలికి వస్తే ఊరుకొనేది లేదు
రుద్రూర్ (జనంసాక్షి): బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధి ప్రధాత సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి తనయుడు ఉమ్మడి జిల్లాల డీసీసీబీ చైర్మన్ భాస్కర్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నాయకుడు మాల్యాద్రి రెడ్డి వాఖ్యలను ఖండిస్తూ రుద్రూర్ తెరాస మండల నాయకులు మంగళవారం రోజున విలేకరుల సమావేశన్నీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
(జడ్పీటిసి) నారోజి గంగారాం :-
నోరు ఉంది కదా అని పెద్ద, చిన్న తేడా లేకుండా తమ నాయకుల పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరి కాదని, మా నాయకులు చేస్తున్న అభివృద్ధి ని చూసి ఓర్వలేక ఇలా రాజకీయాలు చేస్తే ప్రజలు మీకు సరియైన బుద్ది చెప్పుతారని అన్నారు.
పత్తి లక్ష్మణ్(మండల అధ్యక్షుడు):
తెలంగాణ ఉద్యమంలో మా నాయకుల తో కలిసి మేము ఉద్యమం లో పాల్గొన్నమని, మా నాయకుల గురుంచి మాట్లాడే స్థాయి నీకు లేదని .వాళ్ళ కొట్టమన్నార, వీళ్లు కొట్టమన్నార అని అనడం కాదని, మా నాయకులు మాకు ఎలా ఉండాలో , ఎం మాట్లాడలో నేర్పిరని , మీ మాటలను అదుపులో పెట్టుకోక పోతే మీరు అడుగు కూడా బయట పెట్టాలేరని హెచ్చరించారు.
ఇతర నాయకులు మాట్లాడుతూ:-
తమ నాయకుడు 10000 డబుల్ బెడ్ రూమ్ వచ్చేలా కృషి చేసాడని, పింఛన్లు, రైతులకు, బీమా , రైటు బంధు వంటి ఎన్నో కార్యక్రమలు 100% అమలు చేశారని, ఒక్క స్కాం నిరూపించిన తమకు నియోజకవర్గంలో ఉండమని తెలిపారు, మాల్యాద్రి రెడ్డి నువ్వు ఒక్కసారి ఐన ఒక వార్డు మెంబెర్ గా ఐన గెలిచావా అని ఎద్దేవా చేసారు.
ఈ కార్యక్రమంలో, జడ్పిటిసి నారోజీ గంగారం, అక్కపల్లి నాగేందర్, పత్తి లక్ష్మణ్, పత్తి రాము, తోట సంగయ్య, సంజీవ్ రెడ్డి, , పత్తి సాయిలు, తొట్ల గంగారాం, కన్నె రవి, లాల్ మహమ్మద్ ఇతర నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.