మిరప రైతులకు పంట ప్రదర్శన క్షేత్రం

డోర్నకల్ ఫిబ్రవరి 9 (జనం సాక్షి)

మిరపకు తెగుళ్ల బెడద అధికమన్న సంగతి తెలిసిందే.రోగాలను తట్టుకొని అధిక దిగుబడినిచ్చే కరోనా 99, జీవ సుమతి మిరప రకాలను జీవలాజిక్స్ కంపెనీ మార్కెట్ లో పరిచయం చేసిందని ఆ సంస్థ ఏరియా మేనేజర్ కె.శ్రావణ్ కుమార్ తెలిపారు.వైరస్‌ ఆశించిన చేలో పంటపై రైతు ఆశలు వదిలేసుకోవాల్సిందే.లేదా నిత్యం పంటచేలోనే ఉంటూ రకరకాల మందుల పిచికారీతో నిరంతరం యుద్ధమే చేస్తుంటారు.ఈ క్రమంలో జీవలాజిక్స్ వారి కరోనా 99,జీవ సుమతి అనే రకాలను తోడేళ్ళగూడెం శివారు తనగంపాడు రైతు బండి సురేష్ మిరప తోటను బుధవారం చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వందలాది మంది రైతులు పంట పరిశీలించారు.ఈ సందర్భంగా ఏరియా మేనేజర్ కె.శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ… కాయ ముదురాకుపచ్చ రంగుతో మంచి నిగారింపు ఉంటుంది.చివరి కాపు వరకు కాయ పొడవు ఒకేవిధంగా ఉంటుందన్నారు.దగ్గరి కాపు గింజ శాతం అధికంగా ఉంటుందన్నారు. రైతులకు తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి వస్తుందన్నారు.ఎకరాకు 35 నుంచి 40 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని తెలిపారు.కార్యక్రమంలో కంపెనీ డైరెక్టర్స్ అక్షయ్,పుష్కర్,ప్రతినిధులు శ్రీనివాస్,శివాలాల్ తో పాటు కంపెనీ డిస్ట్రిబ్యూటర్స్ : రైతు మిత్ర ట్రేడింగ్ కంపెని-ఖమ్మం శ్రీ లక్ష్మి వెంకటరమణ సీడ్స్- ఖమ్మం,కీర్తి ఎంటర్ప్రైజెస్-ఖమ్మం,శ్రీ సాయి మణికంఠ ఏజెన్సీస్- ఖమ్మం హాజరైనట్లు తెలిపారు.