మిర్యాలగూడలో ఘనంగా సామూహిక జాతీయ గీతాలాపన

 

మిర్యాలగూడ. జనం సాక్షి ఆగస్టు16: :స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాలలో భాగంగా
తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న “సాముహిక జాతీయ గీతాలాపన” కార్యక్రమం మిర్యాలగూడ ఘనంగా జరిగింది. మంగళవారం ఉదయం 11:30 నిముషాలకు
జనగణమన గీతాన్ని ఆలపించారు.ఎన్ఎస్పీ క్యాంప్ గ్రౌండ్ లో జాతీయ గీతాలాపన కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, కమిషనర్ రవీందర్ సాగర్, టూ టౌన్ సిఐ సురేష్, ఎస్సైలు మున్సిపల్ కౌన్సిలర్లు, పలు పాఠశాల విద్యార్థులు యాజమాన్యం, ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఎన్ బి.ఆర్ ఫౌండేషన్ చైర్మన్ టిఆర్ఎస్ యువనేత నల్లమోతు సిద్ధార్థ, వన్ టౌన్ సిఐ శ్రీనివాస్, తాసిల్దార్ అనిల్ కుమార్, వివిధ పాఠశాలల కళాశాలల విద్యార్థులు ఉపాధ్యాయులు యాజమాన్యం అలుగుబెల్లి శ్రీనివాసరెడ్డి తో పాటు జర్నలిస్టులు ఎండి అస్లాం, రంగ శ్రీనివాస్, బొంగరాల మట్టయ్య, నాసరుద్దీన్, టిఆర్ఎస్ నాయకులు షోయబ్, శ్రావణ్ రెడ్డి, ఎంపీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే, జడ్పిటిసి తిప్పన విజయసింహారెడ్డి ఎంపీపీ నూకల సరళ హనుమంత్ రెడ్డి ఎంపీడీవో జ్యోతిలక్ష్మి, సూపర్డెంట్ కర్ణాకర్ రావు, మాజీ మార్కెట్ చైర్మన్ చిట్టిబాబు నాయక్, గ్రామ కార్యదర్శులు ప్రజాప్రతినిధులు కార్యాలయ సిబ్బంది, పాల్గొన్నారు. హైదరాబాదుకు వెళుతూ మార్గమధ్యంలో చౌటుప్పల్ వద్ద జాతీయ గీతాలాపన కార్యక్రమంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్నాటి రమేష్ పాల్గొన్నారు.