ముంపుకు గురైన గ్రామాలలో విస్తృతంగా పర్యటించిన జిల్లా సిపిఐ బృందం

పాక నియోజకవర్గం జూలై 16 ( జనం సాక్షి):

గోదావరి ముంపు బాధితలను జిల్లా సిపిఐ బృందం శనివారం పినపాక నియోజకవర్గ మండలలైనా బూర్గంపాడు, అశ్వాపురం మణుగూరు పినపాక మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా బాధితకుటుంబాలను కలిసి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వారు చెప్పిన హృదయవిచారకర పరిస్థితి చూసి ప్రతినిథి బృందం చలించిపోయారు. కట్టు బట్టలు తో ఇంటిలోని వస్తువులను వదిలి రావటంతో వస్తువులన్నీ నీట మునిగి పాడైపోయి ఆర్దికంగా ప్రతి కుటుంబo లక్షల్లో నష్టం వాటిల్లిందని బాధితులు బోరున ఏడుస్తూ వేడుకున్నారు. పశువులు, మేకలు, కోళ్లు మొత్తం నీటమునిగి కొట్టుకపొయ్యాయిని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు వేసిన పత్తి మిరప వరి పంటలు నీట మునిగాయి.
ఇంట్లో విలువైన సామాగ్రి తడిసిపోవటంతో ఇన్నాళ్లు కష్టపడి సంపాదించిన పరికరాలు ఉపయోగం లేకుంటాపోయాయిని కన్నీళ్లు మున్నీరు పెట్టుకొని దీన స్థితిలో ఉన్నారు.వరద బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం అందించాలి.
అంటు రోగాలు నివారణ కోసం హెల్త్ క్యాంప్స్ ఏర్పాటు చేయాలి. ప్రతి గ్రామ పంచాయితికి 25 లక్షలు గ్రాంట్ అందించాలి.ఇండ్లు కూలిన వారికీ తక్షణం 6 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాలి. గ్యాస్ ,బియ్యం ,నిత్యవసర సరుకులు ,కూరగాయలు ,దుప్పట్లు ,
బట్టలు , జీసీసీ ద్వారా ప్రభుత్వం ఉచితంగా అందించాలని డిమాండ్ చేశారు. ఈ పర్యటన లో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా ,సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నారటీ ప్రసాద్ .మున్నా లక్ష్మి కుమారి .ఆర్ లక్ష్మినారాయణ . అక్కి నర్సింహారావు , జంగం మోహనరావు , దూర్గ్యల సుధాకర్,ఎంపీటీసీకామిశెట్టి రామారావు , మనోహర చారి ,తొగటి కుమార్ , సాగిరాజు వీరభద్రరాజు ,వెంకటాచారి , విజయలక్ష్మి , కుటుంబరావు , కె వి నారాయణరావు , కణితి సత్యనారాయణ , ఉమర్ తోట రమేష్ తదితరులు పాల్గొన్నారు.