ముంపు గ్రామాల్లో పర్యటించిన టిఆర్ఎస్ నాయకులు

 

పినపాక నియోజకవర్గం జూలై 15 ( జనం సాక్షి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని చిన్న రాయిగూడెం, కమలాపురం, అన్నారం, ఆనంతారం, కొండాయిగూడెం, చిక్కుడు గుంట గ్రామంలో గోదావరి ముంపునకు గురవుతున్న ప్రాంతాల్లో టీఆర్ ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం విస్తృతంగా పర్యటించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరద ముంపు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాము. మండలంలోని అధికారులను సమన్వయం చేస్తూ సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
వర్షాలు, వరదలు కారణంగా నష్టపోయిన ప్రజలకు ఆదుకునేందుకు సర్కార్ సిద్ధంగా ఉన్నదని ఆయన అన్నారు. ఎంతటి విపత్తునైనా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు, అధికార యంత్రం క్షేత్రస్థాయిలోనే ఉన్నదని , ఎలాంటి ఆందోళన వద్దని సూచించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ప్రభుత్వ విప్, పినపాక నియోజకవర్గ ఎమ్యెల్యే రేగా కాంతారావు సూచనలతో అధికారులు ఎప్పటికప్పుడు వరద పరిస్థితిలను పరివేక్షిస్తున్నారు.
గోదావరి వరద ఇండ్లు లోకి చేరి నిరశ్రయు లుగా మారిన వారిని గుర్తించి పునరవాస కేంద్రాలకు తరలిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. వీఆర్వో స్థాయి నుంచి ఎమ్మార్వో పోలీస్ సిబ్బంది, పలు శాఖల ప్రభుత్వ అధికారులు గ్రామాలలో అందుబాటులో ఉన్నారు. అవసరాన్ని బట్టి వారికి ప్రత్యేక పునరవాస కేంద్రాలనువ ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు.మణుగూరు జడ్పీటీసీ పోశం నరసింహరావు ఆధ్వర్యంలో ముంపుకు గురైనా నిరాశ్రయులకు భోజనాలు, మంచినీళ్ల ప్యాకెట్ , కూరగాయలను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో మణుగూరు ఎంపీపీ కారం విజయకుమారి, పీఏసీఎస్ అధ్యక్షుడు నాగేశ్వరరావు, మండల, పట్టణ అధ్యక్షులు. ముత్యం బాబు , అడపా అప్పారావు, బొలిశెట్టి నవీన్, రామిడి రామిరెడ్డి, తాళ్లపల్లి యాదగిరి గౌడ్, ముద్దంగుల కృష్ణ, రమాదేవి, రమా, చంద్ర కళ, మండలం టిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పార్టీ సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.