ముంపు ప్రాంతాలను పరిశీలించిన బిజెపి నాయకులు

జూలై 12(జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల
పరిధిలోని ముంపు గ్రామాల సందర్శనలో భాగంగా బూర్గంపహాడ్, రెడ్డిపాలెం గ్రామాల్లో మంగళవారం జిల్లా మాజీ అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్రెడ్డి పర్యటించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ముంపునకు గురైన పొలాలకు తెలంగాణ ప్రభుత్వం వెంటనే అంచనా వేసి నష్ట పరిహారం చెల్లించాలని, ముంపు ప్రాంతాలలో ఉన్నవారికి రెండు పడకల ఇల్లు ఇవ్వాలని, ప్రతి సంహత్సరం వరదకు గురికాకుండా భద్రాచలం కరకట్ట మాదిరి కట్ట వేయించేలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం వరద బాధిత పునరావాస కేంద్రాలను సందర్శించి అధికారుల ఏర్పాట్లపై వారిని అడిగి తెలుసుకున్నారు. బాధితులకు సౌకర్యాలు అందేలా చూడాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట అధికార ప్రతినిధి ఏనుగు వెంకటరెడ్డి, కిసాన్ మోర్చా కార్య వర్గ సభ్యుడు బిజ్జం శ్రీనివాస రెడ్డి, జిల్లా కార్యదర్శి బిజ్జం శ్రీ కాంత్ రెడ్డి, మండల అధ్యక్షుడు చుక్కపల్లి బాలాజీ, ఓ బి సి మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కేసాగాని శ్రీనివాస్ గౌడ్, యారం సుబ్బారెడ్డి, కోడెబోయిన రవి, తదితరులు పాల్గొన్నారు.