*ముంపు ప్రాంతాలను పర్యటించిన ఎమ్మెల్యే పోదెం వీరయ్య

*యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం,*
జులై14 జనంసాక్షి: గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాజేడు మండలం పూర్తిగా జలదిగ్బంధంలో మునిగి అంధకారంలో ముంపు ప్రాంతాల ప్రజలు అవస్థలు పడుతున్నారని తెలుసుకున్న భద్రాచల శాసన సభ్యులు పోదేం వీరయ్య జోరు వానలో రహదారులపై వరద నీరు ప్రవహిస్తున్న  లెక్కచేయకుండా వాజేడు,వెంకటాపురంలోని  జలదిగ్బంధమైన  చివరి ప్రాంతాలకు వెళ్లి ముంపు ప్రభావిత ప్రజలను కలిసి నేనున్నానని వారికి ధైర్యం చెప్పి.పునరావాస కేంద్రాల్లో వసతులు కల్పించాలని కోరారు,వరద బాధితులకు అధికారులు అన్ని విధాల వసతులు భోజన వసతి పారిశుద్ధ్యం విషయంలో యుద్ధప్రాతిపాదికన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించడం జరిగింది. పునరావాస కేంద్రాల్లో ఉన్నటువంటి వరద బాధితులకు  భోజనలు వడ్డించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో వాజేడు వెంకటాపురం మండలాల అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.