ముంపు ప్రాంతాల్లో జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత విస్తృత పర్యటన

) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల పరిధిలోని మోతె పట్టినగర్, ఇరవెండి, బూర్గంపహాడ్ ముంపు గ్రామాల్లో జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత విస్తృతంగా, అధికారులతో కలిసి పర్యటించారు. బుధవారం రాత్రి వరకు 65 అడుగులు గోదావరి చేరుతుందని ఉన్నత అధికారుల సమాచారం మేరకు ముంపు బాధితులకు కావాల్సిన పునరావాస కేంద్రాలను మండల కేంద్రంలో కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల, స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో, రైతు వేదిక, సారపాక బి పి ఎల్ స్కూల్లో ఏర్పాటు చేసామని తెలిపారు. ముంపు ప్రాంత ప్రజలు సురక్షితంగా ఉండేందుకు పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. ముంపు ప్రాంత ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భోజన ఏర్పాట్లు, తాగునీరు, కరెంట్ అన్ని వసతులు ఏర్పాటు చేశామని, ఎవరు ఎటువంటి ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేసామని తెలిపారు. ఏవైనా ఇబ్బందులు ఉన్న తమ దృష్టికి తీసుకు రావాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పి ఏ సి ఎస్ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, మండల టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, ఇరవెండి మాజీ ఎంపీటీసీ వల్లూరిపల్లి వంశీకృష్ణ, మండల టిఆర్ఎస్ యూత్ గోనెల నాని, సర్పంచ్ సిరిపురపు స్వప్న, టిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి జక్కం సుబ్రమణ్యం, ఆర్ డి ఓ స్వర్ణలత, తహశీల్దార్ బి.భగవాన్ రెడ్డి ,ఎంపీడీఓ వివేక్ రాం, ఎంపీఒ సునీల్ కుమార్, సి ఐ సత్యనారాయణ, ఎస్ఐ జీవన్ రాజు, స్థానిక సర్పంచులు పోతునూరి సూరమ్మ,కోర్స లక్ష్మీ, పిఆర్ఏఈ వెంకటేశ్వర్లు, జూనియర్ అసిస్టెంట్ పరమేష్, స్థానిక పంచాయతీ సెక్రటరీలు, పంచాయతీ సిబ్బంది, రెవిన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Attachments area