ముగ్గురు ఉపాధి కూలీల మృతి: ఆరాతీసిన ఎంపి కవిత
జగిత్యాల,మే8(జనం సాక్షి): మల్లాపూర్ మండలం కుస్తాపూర్‌లో మట్టిపెల్లలు పడి ముగ్గురు ఉపాధి హావిూ కూలీలు మృతి చెందిన విషయం తెలిసిందే. కూలీల మృతిపై టీఆర్‌ఎస్ ఎంపీ కవిత తీవ్ర దిగ్భాం/-రతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావుతో పాటు సంబంధిత అధికారులతో కవిత మాట్లాడారు. మెట్‌పల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిపై కవిత ఆరా తీశారు. మెరుగైన వైద్యం కోసం వారిని హైదరాబాద్‌కు తరలించాలని అధికారులకు ఆమె సూచించారు. ముత్తమ్మ(45), రాజు(55), జెల్లా పోషాని(50) అనే కూలీలు మృతి చెందారు. ముగ్గురు ఉపాధి హావిూ కూలీలు మట్టిపెల్లలు పడి మృతి చెందడంపై జగిత్యాల కలెక్టర్ సీరియస్‌గా స్పందించారు. ఉపాధి హావిూ ఉద్యోగులైన టెక్నికల్, ఫీల్డ్ అసిస్టెంట్లను కలెక్టర్ సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై విచారణ చేయాల్సిందిగా జేసీ రాజేశంకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.