ముత్యాలమ్మ తల్లికి ఘనంగా బోనాల జాతర
టేకులపల్లి, ఆగస్టు 14( జనం సాక్షి ): టేకులపల్లి మండలంలో పలు గ్రామాలలో ముత్యాలమ్మ తల్లికి బోనాల జాతర ఘనంగా నిర్వహించారు. శ్రావణమాసం ఆదివారం కావడంతో గ్రామాలలో మహిళలు బోనాలు ఎత్తుకొని డప్పు వాయిద్యాలు మధ్యన నృత్యాలతో జాతరలాగా ఆయా గ్రామాలలో నెలకొని ఉన్న ముత్యాలమ్మ తల్లి గుడి వద్దకు బయలుదేరి వెళ్లడం గ్రామాలలో పండుగ వాతావరణం ఏర్పడింది . మండలంలోని బిల్లుడుతండా, బొమ్మనపల్లి ముత్యాలమ్మ తల్లి బోనాల జాతరలో గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వాంకుడోత్ హతిరామ్ నాయక్ పాల్గొని మొక్కులు చెల్లించారు. అదేవిధంగా సులానగర్ సీతారాంపురం కోయగూడెం ముత్యాలంపాడు టేకులపల్లి బోడు కొప్పురాయి తదితర గ్రామాలలో బోనాల జాతర నిర్వహించారు.