ముధోల్‌ అభివృద్ధిపై సీఎం సమీక్ష

హైదరాబాద్‌,డిసెంబరు 30 (జనంసాక్షి):ముదోల్‌ నియోజక వర్గం పరిధిలో పలు అభివృద్ది పనులను సత్వరమే పూర్తిచేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్‌ అధికారులను ఆదేశించారు. స్థానిక ఎమ్మెల్యే జి.విఠల్‌ రెడ్డి బుధవారం ప్రగతి భవన్‌ లో ముఖ్యమంత్రిని కలిసి పలు అంశాలను ప్రస్తావించారు. వీటిపై సిఎం సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా.. ఆరువేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూపొందించిన పిప్రి లిఫ్టు ఇరిగేషన్‌ పనులను చేపట్టాలని, గడ్డన్నవాగు ప్రాజెక్టు నిర్మాణంలో మిగిలిన పదికిలోవిూటర్ల పొడవు సిసి కెనాల్‌ ను సత్వరమే పూర్తిచేయాలని, నియోజక వర్గం పరిధిలోని అర్లి వంతెన కూలిపోయే దశలో వున్నందున పునర్మిర్మాణ పనులను చేపట్టాలని, గుండెగావ్‌ గ్రామం ముంపుకు గురవుతున్నందున గ్రామ ప్రజలను ఆదుకునేందుకు నిర్వాసిత సహాయ కార్యక్రమాలను చేపట్టాలని., సిఎం అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రజత్‌ కుమార్‌, స్పెషల్‌ సెక్రటరీ స్మితా సబర్వాల్‌ తదితరులు పాల్గొన్నారు.