మునిసిపల్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

అయిజ,జులై 14 (జనం సాక్షి):
జోగులాంబ గద్వాల జిల్లా
అయిజ పురపాలక సంఘం  కార్యాలయ ఆవరణ నందు మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మునిసిపల్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అయిజ పట్టణ
కోశాధికారి నరేష్  అయిజ మునిసిపాలిటీ లో కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను వేతనాల ఎరియర్స్,పీఎఫ్,ఈ ఎస్ ఐ, కార్మికులకు అవసరమైన నూనెలు,సబ్బులు,తదితర వాటి గురించి సి ఐ టి యూ జిల్లా కార్యదర్శి వి వి నర్సింహ  వివరించారు.సిఐటియు జిల్లా కార్యదర్శి వి వి నరసింహ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పెంచిన 30 శాతం వేతనాలకు సంబంధించి ఏరియర్స్ బకాయిలు కు  పెండింగ్లో ఉన్న ఎరియర్స్ బకాయి డబ్బులు తక్షణమే కార్మికుల ఖాతాలో జమ చేయాలని అలాగే హెల్త్ కార్డులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.జిల్లా ప్రధాన కార్యదర్శి మహేంద్ర నాథ్  మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న పీఎఫ్ డబ్బులు తక్షణమే కార్మికుల అకౌంట్ నందు జమ చేయాలని అలాగే వర్షాకాలం ఉన్నందువల్ల కార్మికులకు రేయిన్ కోర్టులు, సబ్బులు, బట్టలు, నూనెలు, చెప్పులు, బెల్లం, దుబ్బట్లు, పోరకలు, తదితర సామాగ్రి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.సమావేశంలో యూనియన్ జిల్లా కార్యవర్గ సభ్యులు వి ఆంజనేయులు, శాంతమ్మ , పార్వతమ్మ , మరియమ్మ , టౌన్ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణ, కార్యవర్గ సభ్యులు అడివన్న,వీరేష్,అనిల్, సుధాకర్,  యూనియన్ సభ్యులు,కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
Attachments area