ముప్పిరితోటలో వ్యక్తి హత్య

 

ఎలిగేడు మండలంలోని ముప్పిరి గ్రామానికి చెందిన పురెళ్ల కోమురయ్య (46) సోమవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. సుల్తానాబాద్‌ ఇన్‌చార్జి సీఐ శ్రీనివాసరావు తెలిపారు. వివరాల ప్రకారం ద్విచక్ర వాహనానికి పైనాన్స్‌లో నెలవారి డబ్బులు చెల్లించేందుకు వెళ్లి మంగళవారం ఉదయం గ్రామ శివారులో గల ఎన్‌అర్‌ఎన్‌పి 10 ఎల్‌ కాల్వగట్టుపై శరీరం, ముఖంపై కత్తిపోట్లతో శవంగా మారాడని అయన తెలిపారు.హత్యకు సంబందించిన వివరాలు అన్నికోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. అమన వెంట జౌలపల్లి ఎన్‌ఐ లక్ష్మినారాయణ ఉన్నారు.