ముస్తాబాద్‌లో నిరుద్యోగులకు శిక్షణ కేంద్రం
రాజన్న సిరిసిల్ల,జూన్21(జనం సాక్షి): సిరసిల్ల జిల్లాలోని ముస్తాబాద్‌లో కేటీఆర్ ఉద్యోగ ఉచిత శిక్షణ కేంద్రాన్ని డీఎస్పీ వెంకటరమణ గురువారం ప్రారంభించారు. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేరయ్యే అభ్యర్థులకు ఈ కేంద్రంలో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నారు. ఇటీవల విడుదలైన కానిస్టేబుల్, ఎస్‌ఐ, గ్రూప్-4, వీఆర్‌వో ఉద్యోగాలకు ఉచితంగా క్లాసులు ప్రారంభమయ్యాయి. ఈ అవకాశాన్ని స్థానిక అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని డీఎస్పీ వెంకటరమణ సూచించారు. ఇక్కడ శిక్షణతో పాటు మెళకువులను ఇస్తున్నారు. గ్రావిూణ ప్రాంత అభ్యర్థులకు మేలు చేయలన్న ఉద్దేశ్యంతో దీనిని ఏర్నాటు చేశారు.