మూసీ ప్రక్షాళన అడ్డుకునే దమ్ముందా!
` ప్రతిపక్షాలకు సీఎం రేవంత్ సవాల్
` నదీ పునరుజ్జీవం జరిగి తీరుతుంది..
` సంగెం శివయ్య దగ్గర సంకల్పం తీసుకున్నా.. ప్రక్షాళన చేసి తీరుతా…
` బుల్డోజర్లకు ఎవరు అడ్డొచ్చినా లెక్కచేయం..తొక్కుకుంట పోవుడే..
` ఈ ప్రాజెక్టును చేపట్టాలని కృనిశ్చయంతో ఉన్నాం
` 30 రోజుల్లో తుదిరూపం తీసుకొస్తాం
` జనవరిలో వాడపల్లి నుంచి హైదరాబాద్‌కు పాదయాత్ర చేస్తా
` మూసీ పాదయాత్రలో కార్నర్ మీటింగ్‌లో సీఎం రేవంత్ రెడ్డి
` సంగెం నుంచి భీమలింగం వరకు 2.5 కి.విూ మేర సీఎం పాదయాత్ర
` కార్యక్రమంలో భారీగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు
యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో,నల్గొండ నవంబర్ 8 (జనంసాక్షి):మూసీ పునరుజ్జీవన పాదయాత్రను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. సంగెంలోని మూసీనది ఒడ్డున ఉన్న శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించి యాత్రను మొదలుపెట్టారు. యాదాద్రి జిల్లా వలిగొండ మండలం సంగెం నుంచి భీమలింగం వరకు సుమారు 2.5 కి.విూ మేర పాదయాత్ర చేశారు. మూసీ పునరుజ్జీవ యాత్రలో కాంగ్రెస్ శ్రేణులు భారీగా పాల్గొన్నారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొన్నం ప్రభాకర్ కొండా సురేఖ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తదితరులు సీఎం వెంట ఉన్నారు.మూసీ ప్రక్షాళనకు కొంతమంది దుర్మార్గులు అడ్డొస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు.‘‘ శివయ్య దగ్గర సంకల్పం తీసుకున్నా.. మూసీని ప్రక్షాళన చేసి తీరుతానని..బుల్డోజర్లకు అడ్డుపడుతామన్న వాళ్లెవరో పేర్లు ఇవ్వండి నల్లగొండ ప్రజలతో కలిసి వచ్చి అడ్డుకునే వాళ్లపై బుల్డోజర్లు తీసుకుపోతానని… లేకుంటే నా పేరు మార్చుకుంటా’’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అడ్డుపడే వారిలో భారాస ముందుందని అన్నారు.మూసీ పరివాహక ప్రాంతంలోని ఉత్పత్తులను ఎవరూ కొనట్లేదని, ఈ ప్రాంతంలో కల్లు అమ్ముకునే పరిస్థితి కూడా లేదన్నారు. ఒకనాడు మంచి నీటిని అందించిన మూసీ ఇప్పుడు మురికి కూపంగా మారి విషాన్ని చిమ్ముతోందన్నారు. పాలకులు పగ పట్టారా.. దేవుడు శాపం పెట్టిండా అని మూసీ పరివాహక ప్రాంత ప్రజలు బాధపడుతున్నారని మూసీపునరుజ్జీవింప చేయాలని కోరుతున్నారని చెప్పారు. ఈ ప్రాంతంలో కులవృత్తులు చేసుకునే పరిస్థితి లేదు.. ఇక్కడి చెరువుల్లో చేపలు బ్రతికే పరిస్థితి లేదు..ఇక్కడ పండిన పంటలను తినే పరిస్థితి లేదు.. ఇక్కడ పశువుల పాలు తాగాలన్నా ఆలోచించాల్సిన దుస్థితి ఏర్పడిరదని ఆవేదన వ్యక్తం చేశారు. పాడిపంటలతో ఎంతో సంతోషంగా బతికిన ఇక్కడి ప్రజలు.. ఇపుడు భూములు అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. బీఆరెస్ నేతలకు దోచుకోవడమే తప్ప ప్రజలకు మేలు చేయడం తెలియదని అందుకే మూసీ ప్రక్షాళనను అడ్డుకోవాలని చూస్తున్నారని చెప్పారు. మూసీ ప్రక్షాళనకు అండగా ఉంటామని చెప్పిన కమ్యూనిస్టు సోదరులకు ధన్యవాదాలు తెలిపారు. మూసీ కాలుష్యంతో ఇక్కడి ప్రజలు అణుబాంబు కంటే ప్రమాదాన్ని ఎదుర్కోబోతున్నారని ఆవేదన వెలిబుచ్చారు. వరంగా ఉండాల్సిన మూసీ శాపంగా మారుతోందని అందుకే మూసీ ప్రక్షాళన చేయాలో లేదో ఒక్కసారి ఆలోచించండని ప్రజలను కోరారు. మోదీ గుజరాత్ ను బాగు చేసుకోవచ్చు కానీ మేం మూసీని బాగుచేసుకోవద్దా అని బిజెపి నాయకులని ప్రశ్నించారు. ఇది నా జన్మదినం కాదు… ఇక్కడికి రావడంతో నా జన్మ ధన్యమైందన్నారు. కెసిఆర్ ని బిడ్డ మూడు నెలలు జైలుకు పోతేనే నీకు దుఃఖం వస్తే… మూసీ పరివాహక బిడ్డల జీవితాలు పోతుంటే నీకు పట్టదా? అని ప్రశ్నించారు. నల్లగొండ ప్రజలు నీకు ఓట్లు వేయలేదనా కేసీఆర్ ?మూసీ ప్రక్షాళన అడ్డుకోవాలని చూస్తున్నావన్నారు. నల్లగొండ జిల్లా పౌరుషాల గడ్డ… మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటే మూసీలోనే పాతరేస్తారని చెప్పారు. వాళ్ల అవినీతి కోసం, వాళ్ల దోపిడీ కోసం మూసీని అడ్డుకోవాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మూసీ నదిలో చేపలు బతుకుతున్నాయా? ఈ నది ఒడ్డున పెంచిన గొర్రెలను ఎవరూ కొనడం లేదు. మూసీ నది కలుషితం కావడంతో వ్యవసాయం చేయడం లేదు. మూసీ కాలుష్యం కారణంగా పట్టణాలు, గ్రామాలు నాశనం అవుతున్నాయి. కాళేశ్వరం పేరుతో భారాస నేతలు రూ.లక్ష కోట్లు దోచుకున్నారు. భారాస నేతల మాదిరిగా గారడీ చేయడం మాకు రాదు.మూసీ ప్రక్షాళన, బుల్డోజర్‌కు ఎవరు అడ్డొచ్చినా లెక్కచేయం. ఈ ప్రాజెక్టును చేపట్టాలని నిశ్చయించుకున్నాం. మరో 30 రోజుల్లో తుదిరూపం తీసుకొస్తాం’’ అని సీఎం తెలిపారు. 2025 జనవరి మొదటి వారంలో వాడపల్లి నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర మొదలు పెడతా బిల్లా రంగాలు రావాలి.. మిమ్మల్ని ఇక్కడి ప్రజలు రానిస్తారో.. నడుముకు తాడుకట్టి మూసీలో ముంచేస్తారో చూద్దామని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
సీఎం రేవంత్‌కు ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు
హైదరాబాద్(జనంసాక్షి):ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థిస్తున్నట్లు ఎక్స్ వేదికగా వెల్లడిరచారు. ప్రధాని మోదీ పోస్టుకు సీఎం రేవంత్ స్పందించారు. మీ విషెస్‌కు ధన్యవాదాలు అని పేర్కొన్నారు. కాగా, ముఖ్యమంత్రిగా తొలి పుట్టినరోజును జరుపుకుంటున్న రేవంత్ రెడ్డి మరికాసేపట్లో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకోనున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం మూసీ పరీవాహక ప్రాంతాల్లో పర్యటించి రైతులతో మాట్లాడుతారు. మూసీ పునరుజ్జీవ యాత్రను ప్రారంభిస్తారు. సాయంత్రం 4.30 గంటలకు బహిరంగ సభలో పాల్గొంటారు.
ఇక యాదగిరి గుట్టనే..యాదాద్రి రద్దు
` అన్ని రికార్డుల్లో వ్యవహారికంలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశం
` టీటీడీ తరహాలో ఆలయానికి టెంపుల్ బోర్డు
` విమాన గోపురానికి బంగారు తాపడం పనులను వేగవంతం చేయాలి
` ఆలయ అభివృద్ధిపై అధికారులతో సీఎం సమీక్ష
ఇక నుంచి యాదాద్రి బదులుగా అన్ని రికార్డుల్లో యాదగిరిగుట్టగా వ్యవహారికంలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.శుక్రవారం యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై అధికారులతో సవిూక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అధికారులకు స్పష్టం చేశారు. టెంపుల్ బోర్డు ఏర్పాటు చేసేందుకు కావాల్సిన చర్యలు చేపట్టాలన్నారు.టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఉండేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.టీటీడీ స్థాయిలో బోర్డుకు ప్రాధాన్యత ఉండేలా పూర్తి అధ్యయనంతో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. గోశాలలో గోసంరక్షణకు ఒక ప్రత్యేక పాలసీని తీసుకురావాలని అధికారులకు సూచించారు.గోసంరక్షణకు అవసరమైతే టెక్నాలజీని ఉపయోగించుకోవాలని గతంలో కొండపై నిద్ర చేసేందుకు భక్తులకు అవకాశం ఉండేదని గుర్తుచేశారు. కొండపై నిద్ర చేసి మొక్కులు తీర్చుకునేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విమాన గోపురానికి బంగారు తాపడం పనులను వేగవంతం చేయాలన్నారు.బ్రహ్మోత్సవాల నాటికి బంగారు తాపడం పనులు పూర్తి చేయాలన్నారు.ఆలయ అభివృద్ధికి సంబంధించి పెండిరగ్ లో ఉన్న భూసేకరణను పూర్తి చేయాలని అందుకు అవసరమైన నిధులను మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు.ఆలయానికి సంబంధించి పెండిరగ్ పనులు పూర్తి చేయాల్సిందేనని స్పష్టం చేశారు.మరో వారంరోజుల్లో పూర్తి వివరాలు, ప్రపోజల్స్ తో రావాలన్నారు.ఆలయానికి సంబంధించి అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని పెండిరగ్ పనులు, ఇతర అంశాలపై పూర్తిస్థాయి రిపోర్ట్ అందించాలన్నారు.
ఆనాడే చెప్పిన ‘జనంసాక్షి’
‘యాదాద్రి’ కాదు.. ‘యాదగిరిగుట్ట’ కావాలని భక్తుల మనోభావాలపై ప్రత్యేక కథనాలు
(గతంలో ‘యాద్రాద్రి’ని యాదగిరిగుట్టగా పేరు మార్చాలని ప్రజాభిప్రాయాన్ని సర్వే చేసి తేల్చి చెప్పిన ‘జనంసాక్షి’ కథనాలు)