మృత్యు కూపాలుగా మారిన జైళ్ళు

రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జైళ్లలో ఖైదీల మరణాల సంఖ్య నానాటికి పెరుగుతుంది తెలిసో తెలియకో క్షణికావేశంలో నేరాలకు పాల్పడి జైలుకు వస్తే జైలు నుంచి తిరిగి మళ్లీ విడుదలయి పోతారని ఆశలు సన్నగిల్లుతున్నారు. ఖైదీల సత్ప్రవర్తనకు జైళ్లలో మాజీ డిజి సీఎస్‌ గోపినాధ్‌రెడ్డి సంస్కరణ ప్రవేశపెట్టినప్పటికి అవి ఏ మాత్రం ఫలించలేదు. 2006 నుంచి 2012 వరకు రాష్ట్ర వ్యాప్తంగా కోస్తాంధ్రాలో 230 రాయలసీమ ప్రాంతంలో 162, తెలంగాణలో 339 మంది ఖైదీలు జైళ్లలో వివిధ కారణాలవల్ల మరణించారు. చర్లపల్లి కేంద్రకారగారంలో మెదక్‌ జిల్లా కోహిర్‌కు చెందిన శిక్ష ఖైది అగమయ్యి నైలాన్‌ తాడుతో ఉరి వేసుకుని కందుల రవి నల్గొండ జిల్లా మిర్యాలగూడా నివాసి ఓ హత్య కేసులో జీవిత శిక్ష పడిరది. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడగా, వరంగల్‌ జల్లా గీసుకొండకు చెందిన బాస్కర్‌ను జైలు అధికారులే కొట్టి చంపారు. 2008 అగస్టు 31న దీంతో జైలు అధికారులు 4 గురిని హుటాహుటనా సస్పెండ్‌ చేశారు. దీన్‌దార్‌ అంజుమన్‌కు చెందన బాబజాన్‌ , రఘ వైద్యం అందక మృతి చెందాడు. ఫిబ్రవరి 2`2`2013న నల్గొండ జిల్లాకు చెందిన శిక్ష ఖైది ఇంద్రారెడ్డికి ఇంజక్షన్‌ డాక్టర్‌ కాశీం వేయడంతో అక్కడికక్కడే వికటించి మృతి చెందాడు. వరంగల్‌ సెంట్రల్‌ జైలులో ఆదివాసి ఖైదీ జోగాలు 2012లో మృతి చెందాడు. నాగేశ్వరరావు ఖైదీ ఆత్మహత్యకు పాల్పడినాడు. రాష్ట్ర వ్యాప్తంగా చంచల్‌గూడా చర్లపల్లి వరంగల్‌ రాజమండ్రి విశాఖపట్నం నెల్లూరు కడప ప్రధాన కేంద్ర కారాగారాలు జిల్లా జైళ్లు 14 రెండు ఓడ నీరు జైళ్లు చంచల్‌రూడా రాజమండ్రి రెండు వ్యవసాయ క్షేత్రాలు అనంతపురం చర్లపల్లి 145 సబ్‌జైళ్లలో 132 సబ్‌ జైళ్లు పని చేస్తున్నవి. మిగతావి ఖైదీలు లేకపోవడంతో మూసివేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 14 వేల మంది ఖైదీలు ఇందులో సుమారు 3500 మంది జీవిత ఖైదీలు జైలు వార్డెర్స్‌ 2200, హెడ్‌ క్వార్టర్స్‌ 555 చీఫ్‌హెడ్‌ క్వార్టర్స్‌ 54 డిప్యూటి జైలర్స్‌ 275 జైలర్లు 155 మంది 60 మంది ఉప పర్యవేక్షణాధికారులు, పదిమంది పర్యవేక్షణాధికారులు, ముగ్గురు డిఐజిలు ఒక ఐజి ఒక డిజి లు పనిచేస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే చర్లపల్లి వరంగల్‌ విశాఖపట్నం జైళ్లలో ఖైదీలు ఎక్కువగా మరణిస్తున్నారు. చర్లపల్లి కేంద్ర కారాగారంలో 2000 మంది ఖైదీలున్నారు. 50 పడకల ఆసుపత్రి ఉంది. కేవలం ముగ్గురు డాక్టర్లు మాత్రమే వీరు ఖైదీలకు అందుబాటులో ఉండకుండా ప్రయివేటు ప్రాక్టిస్‌ చేస్తున్నారు. గతంలో చర్లపల్లి కేంద్రకారాగారంలో 2003లో బాబజాన్‌కు ఖైదీ మల్లేశం ఇంజక్షన్‌ వేయడంతో వికటించి బబాజాన్‌ మృతిచెందాడు. ఖైదీలే డాక్టర్లుగా పని చేస్తున్నారు. వరంగల్లు జైలులో 809 మంది ఖైదీలున్నారు. 25 పడకలు అసుపత్రి 4గురు డాక్టర్లు పని చేస్తున్నారు. 2009లో తరుచు ఖైదీలు మరణాలపై జిల్లా న్యాయమూర్తిలు స్పందించి హుటాపహుటినా జైలును తనిఖీలు నిర్వహించారు. తక్షణమే నాణ్యమైన ఆహారాన్నందించి, వైద్యసేవలందించాలని జైలు అధికారులను న్యాయమూర్తులు ఆదేశించారు. 2010లో అనంతపురం జైలులో మొద్దుశీనును, ఓం ప్రకాశ్‌ బండిల్స్‌తో కొట్టి చంపాడు. 6`9`2012 ఎం శ్రీనివాస్‌ మెదక్‌ జిల్లా నంగునూర్‌ మండలం రాజరోపాలపేటకు చెందిన ఖైదీ చర్లపల్లి జైలులో అత్మహత్యకు పాల్పడినాడు. 11`7`2012 చర్లపల్లి జైలులో మానసిక ఖైదీ నర్సింహ తోటి ఖైదీలు వెంకటయ్య చలపతిరావు ఉషయ్యల కకత్తెరలో పొడవడంతో వెంకటయ్య అనే జీవిత ఖైదీ మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయిలైనాయిఈ విషయంపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి హోంమంత్రి సబిత ఇంద్రారెడ్డి లు విచారణకు జైలు శాఖాదికారులను ఆదేశించారు. 2010లో అహ్మద్‌: అనే ఖైదీ మరో ఖైదీ పై బ్లేడుతో గాయపరిచాడు. ఈ సంఘటనపై జైలు అదికారులు రాజమహేష్‌ విశ్వేశ్వర్‌రెడ్డి లకు బదిలీ వేటు వేయగా చింత శ్రీనివాస్‌, నిరంజన్‌రెడ్డిలను విధులనుంచి తొలగించారు. డాక్టర్‌ మోహన్‌పై విచారణకు ఆదేశంచారు.జైళ్లో ఖైదీలకు వడ్డించే ఆమయరంలో నాణ్యత విలువలు లోపిస్తున్నాయి. ఆహరం సరిగా లేకపోవడంతో తరచూ ఖైదీలు గుండేపోటు వ్యాధులతో మరణిస్తున్నారని జైలు అదికారులు అంటున్నారు. వైద్య సరుపాయాలు అంతంత మాత్రంగానే అందుతున్నాయి. ఎలాంటి వ్యాదులకైనా బకే విధమైన మందులన ఖైదీలకు అందించడంతో మరనాల సంఖ్య పెరిగిపోతుంది. జైల్లో చనిపోయిన అనంతరం జైలు అధికారులు గుట్టు చప్పుడు కాకుండా గాంధీ ఉస్మానియా , ఎంజిఎం అసుపత్రులకు తరిలించి తమకేమి తెలియదన్నట్లు వ్యవహరిస్తున్నారు. కొన్ని కొన్న జైళ్లలో అంబులెన్ప్‌ కొరత తీవ్రంగా ఉంది. అదికారుల వాదన మరోలా వుంది ఖైదీలు మానసిక వేదనతో ప్రతి రోజు అక్షల్లో బీడీలు గంజాయి కాల్చడంతో ఊపిరి తిత్తులవ్యాధితో 50శాతం మంది ఖైదీలు మరణింస్తున్నారు. ఖైదీ మృతి చెందిన అనంతరం రిపోర్టును ఆర్‌,డీ,ఓ జిల్లా కలెక్టర్‌ నుంచి నేరుగా జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు పంపిస్తారు. దీనిపై మానవ హక్కుల కమిషన్‌ విచారణ అందింస్తుంది. హక్కుల సంఘల నేతల న్యాయవాధులు స్వచ్ఛంద సంస్థల వాదనలు మరోలా ఉన్నాయి జైలు అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్లనే అనేక మంది ఖైదీలు జైళ్ళల్లో మృతి చెందుతున్నారని ఆరోపిస్తున్నారు. మానవ హక్కుల కమిషన్లు జోక్యం చేసుకోవల్సిన అవసరం ఎంతైన వుంది.జైళ్ళల్లో ఆహారం తాగునీరు మంచిగా లేనందునే కిడ్ని వ్యాధులు పెరిగిపోతున్నాయి. కావున ప్రభుత్వ అధికారులు స్పందించాలి. ఖైదీల ప్రాణాలు కాపాడాల్సిన భాద్యత ప్రభుత్వ జైలు అధికారులపై ఉంది.
` దామరపల్లి నర్సింహరెడ్డి