మెదక్‌ జిల్లా బంద్‌ మే 3కి వాయిదా

హైదరాబాద్‌ : బయ్యారం గనులపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా తెరాస మే 2న చేపట్టిన మెదక్‌ జిల్లా బంద్‌ను 3వ తేదీకి వాయిదా వేసింది. మే 2న పాలిటెక్నిక్‌ ప్రవేశ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు నేతలు తెలిపారు.