మేడారం అంతటా(త్రినేత్రం) సీసీ కెమెరాల నిఘా
మాస్టర్ కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షణ చేస్తున్న జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య…..
విహెచ్ఎఫ్ సెట్స్, సీసీ టీవీ నెట్వర్క్, వైఫై ఇంచార్జీ ములుగు జిల్లా ఈడిఏం దేవేందర్
సమగ్ర సమాచారంతో మొబైల్ యాప్….
అన్ని శాఖల అధికారులకు వాట్సప్ గ్రూపులతో పర్యవేక్షణ…..
మేడారం టోల్ ఫ్రీ నంబర్ 1800 425 0520….
ములుగు(మేడారం)ఫిబ్రవరి16
(జనం సాక్షి):-
మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర టెక్నాలజీ లో ఎడ్ల బండ్ల నుంచి హెలికాప్టర్ వరకు ఎంతో ఎదిగాం.కాలంతో పాటే మేడారం జాతర మారుతోంది.భక్తుల భద్రత, వసతులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు మోడర్న్టెక్నాలజీని వాడుకుంటున్నారు.మొబైల్యాప్,382 సీసీ కెమెరాలు,మాస్టర్ కంట్రోల్ రూం,21 లైన్ డిపార్ట్మెంట్స్,సమాచార వాట్సప్గ్రూపులు,మొత్తం మేడారం 8 జోన్లు,42 సెక్టార్స్, 3 ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్,ప్రతి జోన్ కు నోడల్ అధికారి,జోనల్ అధికారి, సెక్టార్ ఆఫీసర్ తో పాటు అన్ని రకాల డిపార్ట్మెంట్ అధికారులు వుంటారు. సీసీ కెమెరాలు జాతర కీ రోల్ పోషిస్తున్నాయి.జాతరలో ఏది ఎక్కడుందీ..ఎలాంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.. తదితర సమగ్ర సమాచారంతో యాప్అందుబాటులోకి తెచ్చారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారికి,కొత్తగా వచ్చేవారికి ఉపయోగపడేలా ఈ యాప్తయారు చేశారు.అమ్మవార్ల గద్దెలతోపాటు వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్, మెడికల్,ఆర్టీసీ సేవలు, ఇతర సౌకర్యాల రూట్మ్యాప్ఇందులో పొందుపర్చారు. జీపీఎస్ ట్రాకింగ్‌తో లింక్ చేయడం వల్ల భక్తులు కావాలనుకున్న చోటికి ఈజీగా చేరుకోవచ్చు. తప్పిపోయిన వారి వివరాలను కూడా యాప్‌లో పోస్టు చేసే సౌలత్ ఉంది. జాతరలో అన్ని సర్వీస్ ప్రొవైడర్ల సేవలు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ శాఖల వారీగా వాట్సప్గ్రూపులను క్రియేట్ చేసి సంబంధిత ఆఫీసర్లు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు.అన్ని గ్రూపులను కలెక్టర్ టచ్‌లో ఉండే నాలుగు గ్రూపులతో లింక్చేశారు. డ్రింకింగ్ వాటర్,మరుగుదొడ్లు, పార్కింగ్ ప్లేస్‌లకు సంబంధించిన సమస్యలపై దృష్టి సారిస్తున్నారు.ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా గ్రూపులో పోస్ట్ చేయగానే…ఆ ఏరియాలో ఉన్న సిబ్బంది అటెండయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. సీసీ టీవీ లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య,ఎల్బి అదనపు కలెక్టర్ ఇలా త్రిపాటి,రెవెన్యూ అదనపు కలెక్టర్ వైవీ గణేష్ లతో పాటు డిఆర్ఓ రమాదేవి,విహెచ్ఎఫ్ సెట్స్,సీసీ టీవీ నెట్వర్క్, వైఫై ఇంచార్జీ ములుగు జిల్లా ఈడిఏం దేవేందర్ తదితరులు పర్యవేక్షణలో సీసీ టీవీ నెట్వర్క్ పర్యవేక్షణ జరుగుతుంది.భక్తులకు కంట్రోల్ రూమ్ నంబర్ 1800 425 0520 అందుబాటు లో ఉంచారు.