మేము సైతం ట్రస్ట్ ఆధ్వర్యంలో బాధితులకు భోజనం మంచినీళ్లు బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ

 

పినపాక నియోజకవర్గం జూలై 15 (జనం సాక్షి): భారీ వర్షాలతో గోదావరి ఉగ్రరూపందాల్చి ప్రవహిస్తు ప్రకృతి విపత్తు కు గురైనా నేపథ్యంలో వరదముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని అన్ని రకాలుగా సహాయక, రక్షణ చర్యల్లో భాగస్వామ్యం కావటంలో మేము సైతం ట్రస్టు ముందుంటుంది. ఆ క్రమంలోనే మణుగూరు మండలంలోని రాయి గూడెం, కమలాపురం, అన్నారం గ్రామ ప్రజలకు భోజనం, మంచినీళ్ల ప్యాకెట్స్, అరటి పండ్లు పంపిణీ చేశారు.100 ఏళ్లలో ఏనాడు రాని విధంగా గోదావరి ప్రవహిస్తుండటం వల్ల
మండలంలోని ఐదు గ్రామాలు వరద ముంపుకు గురయ్యాయి. వరదల కారణంగా ఇళ్లన్నీ నీట మునిగి సర్వం కొల్పోయి ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. ఈ సమయంలో అండగా ఉండటం వారి కష్టాన్ని కన్నీళ్లను కొంతైనా తీర్చడం మనందరి భాద్యత వర్షం తగ్గిన గొదావరి తగ్గినా వారి ఇళ్లు ముంపు నుంచి బయటకు రావడానికి చాలా సమయం పడుతుంది.ఇళ్లు మునిగిపోవడంతో విలువైన వస్తువులు నీట మునిగి పాడైపోతాయి. ఈ క్రమంలో వారు సాధారణ పరిస్థతులకు వచ్చే వరకు అండగా ఉండే భాద్యత మనందరిపై ఉంది. వ్యాపారస్తుల దాతృత్వంతో బాధితులకు 15 రోజులకు సరిపడ నిత్యావసర సరుకులు, కాయకూరలు పంపిణీ చేసి ఆదుకోవాలన్నారు. పూర్వం అనేక సార్లు కష్టంలో ఉన్న వారికి అండగా నిలిచారు.
ఈ విపత్కర వేళ గొదావరి ముంపు వల్ల సర్వం కొల్పోయున వారికి సహృదయంతో అండగా నిలవాలని కోరారు. ప్రభుత్వాధికారులు ప్రజాప్రతినిధులే కానవసరం లేదు మనసుంటే మానవత్వంతో ఆపదలో ఆదుకోవడానికి మేమున్నామంటూ ముందుకొచ్చిన పి వి చారీ 10 వేలు ఎన్.వినయ్ చారిటబుల్ ట్రస్ట్ హోండా షో రూం 10 వేలు బేతంచర్ల వెంకటేశ్వర రావు10 వేలు సామా అనిల్ రెడ్డి -5 వేలు శ్రీమంత్ రెడ్డి10 వేల సుబ్బారాయుడు 10 వేల రూపాయల ఆర్థిక సహయం చేసి బాధితులకు అండగా నిలిచారు. అడగగానే తక్షణ సహాయ సహకారాలు అందించిన దాతలకు శత కోటి వందనాలు తెలిపారు.