మేము సైతం మిత్రమండలి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం
పినపాక నియోజకవర్గం ఆగస్టు 24 (జనం సాక్షి): మేము సైతం మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత సేవ కార్యక్రమాల్లో భాగంగా సాంబాయి గూడెం గ్రామానికి చెందిన రాచకొండ వెంకట నరసమ్మ కు రూ.4 వేల ఆర్థిక సహాయాన్ని అంద చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేద కుటుంబానికి చెందిన నరసమ్మకు కొద్దిరోజుల క్రితం గుండె సంబంధిత చికిత్స చేయించుకొని మందులకు డబ్బుల్లేక ఇబ్బంది పడుతున్న విషయం మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ దృష్టికి రాగ వెంటనే స్పందించి తక్షణ సాయంగా రూ. 4000 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈకార్యక్రమంలో మేము సైతం మిత్రమండలి సెక్రటరీ మార్తి శ్రీనివాసరావు, ట్రెజరర్ రంగ శ్రీనివాసరావు కార్యక్రమాల నిర్వహణ ఇన్చార్జి చిందుకూరి ఎడుకొండలు తదితరులు పాల్గొన్నారు.