మొక్కలకు రక్షణ తప్పనిసరి

పెద్దపల్లి,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): ఉపాధిహావిూ పథకం సిబ్బంది పనితీరుపైనే మొక్కల ప్రగతి ఆధారపడి ఉందని పెద్దపల్లి శాసనసభ్యుడు దాసరి మనోహర్‌రెడ్డి జిల్లాలోని పేర్కొన్నారు. సింగరేణి, ఎన్టీపీసీ సంస్థలు ఆర్థిక చేయూతనిచ్చేందుకు చర్చిస్తున్నామని, మొక్కలు పంపిణీ చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. నాటిన మొక్కకు తప్పనిసరిగా నీటి తడులు అందించాలని ఆదేశించారు. అధికారులు చిత్తశుద్ధితో పనిచేస్తేనే తమకు గుర్తింపు వస్తుందని తెలిపారు. శాఖలకు కేటాయించిన మొక్కల పెంపకంలో శ్రద్దతీసుకోవాలన్నారు. గతంలో చోటు చేసుకున్న తప్పిదాలపై దృష్టిసారిస్తే ప్రస్తుత లక్ష్యం చేరుకోవడం సులువేనన్నారు.